చెల్లాచెదురుగా దుస్తులు.. అనుమానాస్పద స్థితిలో నర్సింగ్ విద్యార్థిని మృతి..!
జూలూరుపాడు, సెప్టెంబర్ 22 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామంలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. ఓ నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. యువతి ఒంటిపై గాయాలు ఉండటం, దుస్తులు అస్తవ్యస్తంగా ఉండటంతో ఇది ముమ్మాటికీ దారుణ హత్యేనని బంధువులు, స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… వెంగన్నపాలెం గ్రామానికి చెందిన ఇంద్రవెల్లి రాజేశ్వరి, సతీష్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. మూడేళ్ల క్రితం తండ్రి సతీష్ అనారోగ్యంతో మృతి చెందడంతో, తల్లి రాజేశ్వరి కూలి పనులు చేసుకుంటూ ఇద్దరు పిల్లలను చదివిస్తోంది. వీరి పెద్ద కుమార్తె ఇంద్రవెల్లి హరిణి (18) ఖమ్మం జిల్లా తనికెళ్ల సమీపంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఇటీవల కళాశాలకు సెలవులు ఇవ్వడంతో కొత్తగూడెంలోని తన పిన్ని ఇంటికి వెళ్లిన హరిణి, రెండు రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చింది. ఈ క్రమంలో తల్లి రాజేశ్వరి అదే గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంట్లో కూతురు కనిపించలేదు.
బాత్రూం వెనుక భాగంలో నిర్జీవంగా..
ఆందోళనకు గురైన తల్లి పరిసరాల్లో వెతకగా, ఇంటి ఆవరణలోని బాత్రూం వెనుక భాగంలో హరిణి నిర్జీవంగా పడి ఉంది. కూతురి మృతదేహాన్ని చూసి ఆ తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. మృతదేహంపై పలుచోట్ల గాయాలు ఉండటం, దుస్తులు చెల్లాచెదురుగా పడి ఉండటంతో గుర్తుతెలియని దుండగులు అఘాయిత్యానికి పాల్పడి, దారుణంగా హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.