🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 24 Sep, 2026 | Page: 1

జడల్ గెటప్‌లో నాని సినిమాకు యంగ్ హీరో..

నేచుర‌ల్‌ స్టార్ నాని కథానాయకుడిగా నటించిన ‘ది ప్యారడైజ్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రానికి ఒక రోజు ముందుగానే ప్రత్యేక ప్రీమియర్ షోలు కూడా నిర్వహించారు. దీంతో ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘ది ప్యారడైజ్’, నాని పోషించిన జడల్ పాత్ర గురించే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో యంగ్ హీరో హర్ష్ రోషన్ చేసిన ఓ పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్ షోను చూసేందుకు హర్ష్ రోషన్ హైదరాబాద్‌లోని శ్రీరాములు థియేటర్‌కు వెళ్లాడు. అయితే సాధారణంగా వెళ్లకుండా.. సినిమాలో నాని కనిపించిన జడల్ గెటప్‌ను పోలిన లుక్‌లో థియేటర్‌కు రావడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. జడల్ తరహా హెయిర్‌స్టైల్, గెటప్‌తో హర్ష్ రోషన్ థియేటర్‌కు రావడంతో అక్కడ ఉన్న ప్రేక్షకుల దృష్టి అతనిపై పడింది.హర్ష్ రోషన్ జడల్ గెటప్‌లో థియేటర్‌కు వెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. నానిపై తనకున్న అభిమానాన్ని ఈ విధంగా చాటుకున్న హర్ష్ రోషన్‌పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఇందులో మరో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. ప్రస్తుతం హర్ష్ రోషన్ ‘తెల్ల కాగితం’ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అక్టోబర్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇదే సమయంలో ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్‌కు జడల్ గెటప్‌లో వచ్చిన హర్ష్ రోషన్ తన వెనుక భాగంలో ఉన్న షర్ట్‌పై ‘తెల్ల కాగితం.. అక్టోబర్ 2 రిలీజ్’ అనే విషయాన్ని ప్రదర్శించాడు.దీంతో ఒకే సందర్భంలో నానిపై తన అభిమానాన్ని చాటుకోవడంతో పాటు తన రాబోయే సినిమాకు కూడా ప్రచారం కల్పించినట్టైంది. ఈ ఆలోచనపై సామాజిక మాధ్యమాల్లో ఆసక్తికరమైన కామెంట్లు వస్తున్నాయి. నాని జడల్ గెటప్‌ను అనుసరించడం అభిమానాన్ని చూపిస్తే.. షర్ట్‌పై తన సినిమా విడుదల తేదీని చూపించడం మంచి ప్రచార ఆలోచనగా పలువురు అభిప్రాయపడుతున్నారు. హర్ష్ రోషన్‌కు సినీ పరిశ్రమతో చిన్ననాటి నుంచే అనుబంధం ఉంది. బాల నటుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన.. నాని నిర్మించిన ‘కోర్ట్’ సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
🏠 Home