🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 05 Jun, 2026 | Page: 1

అఫ్ఘాన్‌తో సిరీస్‌కు కోహ్లీ దూరం

అఫ్ఘానిస్థాన్‌తో ఈనెల 13 నుంచి 20 వరకు జరిగే మూడు వన్డేల సిరీ్‌సకు స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ దూరమయ్యాడు. ఐపీఎల్‌ ఫైనల్లో బ్యాటింగ్‌ సమయంలో తొడ కండరాల నొప్పితో బాధపడ్డాడు. అయినా ఫిజియోతో చికిత్స చేయించుకుని అజేయంగా నిలిచి ఆర్‌సీబీని గెలిపించాడు. ఇప్పుడా గాయం నయం కాకపోవడంతో విరాట్‌కు రెండు వారాల విశ్రాంతి అవసరమని డాక్టర్లు తేల్చారు. దీంతో అతడి స్థానంలో రుతురాజ్‌ గైక్వాడ్‌ను తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. అయితే ఇప్పటికే రుతురాజ్‌ను భారత్‌ ‘ఎ’ తరఫున ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఒకవేళ రుతురాజ్‌ టీమిండియాకు ఎంపికైతే రజత్‌ పటీదార్‌ ‘ఎ’ జట్టు రేసులో ముందున్నాడు.
🏠 Home