🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 07 Jun, 2026 | Page: 1

తెలంగాణలో జూన్ 15 నుంచి పాఠశాలల పునః ప్రారంభం

హైదరాబాద్, జూన్ 07: తెలంగాణలో అన్ని పాఠశాలలనూ జూన్ 15వ తేదీ సోమవారం నుండి పునః ప్రారంభించనున్నారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 13నే పాఠశాలలు తెరవాల్సి ఉన్నప్పటికీ.. ఆ రోజు రెండో శనివారం కావడంతో పాటు మరుసటి రోజు జూన్ 14న ఆదివారం వచ్చింది. వరుసగా రెండు రోజులు సెలవులు కావడంతో విద్యార్థులు, ఉపాధ్యాయుల సౌకర్యార్థం ప్రభుత్వం పాఠశాలల ప్రారంభ తేదీలో స్వల్ప మార్పులు చేసింది.ఇదిలా ఉంటే.. జూన్ 13వ తేదీ రెండో శనివారం నాడు ఇవ్వాల్సిన సెలవుకు బదులుగా ఆ తర్వాత వచ్చే జులై 11వ తేదీన పాఠశాలలను నిర్వహించనున్నారు. సాధారణంగా జులై నెలలో వచ్చే రెండో శనివారం (జులై 11) నాడు విద్యాసంస్థలకు సెలవు ఉండాల్సి ఉండగా, జూన్ 13 సెలవును ఇక్కడ సర్దుబాటు చేస్తూ ఆ రోజున యథావిధిగా తరగతులను నిర్వహించాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మార్పుల ప్రకారం జూన్ 15 నుంచి నూతన విద్యాసంవత్సరం పూర్తిస్థాయిలో ప్రారంభం కానుంది.
🏠 Home