ముదురుతున్న పెద్ది వివాదం… కాంట్రవర్సీపై నిత్యామీనన్ కామెంట్స్
రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ సినిమా విడుదలైన తర్వాత జాన్వీ కపూర్ పాత్ర చుట్టూ నెలకొన్న వివాదం ఇంకా చర్చనీయాంశంగానే కొనసాగుతోంది. సినిమాలో హీరోయిన్‌ను మరింత గ్లామరస్‌గా చూపించారంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తడంతో ఈ అంశం పెద్ద చర్చకు దారి తీసింది. పలువురు నెటిజన్లు, సినీ ప్రముఖులు దర్శకులను ప్రశ్నిస్తుండగా, మరికొందరు జాన్వీ కపూర్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ వివాదంలో ఇప్పటికే నటీమణులు ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి సహా పలువురు హీరోయిన్లు స్పందించి, హీరోయిన్‌లను విమర్శించడం కంటే దర్శకులను ప్రశ్నించాలని అభిప్రాయపడ్డారు. జాన్వీ పాత్రపై వచ్చిన విమర్శలు తీవ్రరూపం దాల్చడంతో దర్శకుడు బుచ్చిబాబు సానా కూడా స్పందించారు. వివాదాస్పదంగా భావిస్తున్న కొన్ని సన్నివేశాలను తొలగిస్తామని ఆయన చెప్పుకొచ్చారు