భోళా బాలయ్య’ సాంగ్‌తో బర్త్‌డే సెలబ్రేషన్స్ షురూ..
టాలీవుడ్ అగ్రహీరో, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఈసారి మరింత వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి ఏడాది మాదిరిగానే అభిమానులు బాలయ్య పుట్టినరోజును ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమవుతుండగా, ‘ఎన్‌బీకే హెల్పింగ్ హ్యాండ్స్’ సంస్థ ఈ వేడుకలను ప్రత్యేకంగా నిర్వహిస్తోంది. జూన్ 1 నుంచి 10వ తేదీ వరకు పలు సేవా కార్యక్రమాలు, సాంస్కృతిక వేడుకలతో బాలయ్య బర్త్‌డే ఉత్సవాలను పండుగలా జరుపుతోంది. ఈ వేడుకల్లో భాగంగా ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో ‘భోళా బాలయ్య’ పేరుతో రూపొందించిన ప్రత్యేక సిగ్నేచర్ సాంగ్‌ను ఘనంగా విడుదల చేశారు. బాలకృష్ణ వ్యక్తిత్వం, సేవా కార్యక్రమాలు, అభిమానులతో ఆయనకున్న అనుబంధాన్ని ప్రతిబింబించేలా రూపొందించిన ఈ పాట ఆవిష్కరణ కార్యక్రమం సినీ ప్రముఖుల సమక్షంలో అట్టహాసంగా జరిగింది.