ధూమపానం చేయడం మానేస్తే శరీరంలో ఎన్ని అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటాయో తెలుసా..?
ధూమపానం ఆరోగ్యానికి హానికరమని తెలిసినా, చాలా మంది రోజుకు ఒక్క సిగరెట్ మాత్రమే, అప్పుడప్పుడూ మాత్రమే తాగుతాను అనే కారణాలతో అలవాటును కొనసాగిస్తుంటారు. అయితే పొగాకు వినియోగానికి సురక్షితమైన పరిమితి అంటూ ఏదీ లేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ధూమపానం ఊపిరితిత్తులకే కాకుండా గుండె, రక్తనాళాలు, మెదడు, చర్మం సహా శరీరంలోని దాదాపు ప్రతి అవయవంపై ప్రభావం చూపుతుంది. అయితే ధూమపానం పూర్తిగా మానేసిన వెంటనే శరీరం తనను తాను పునరుద్ధరించుకునే ప్రక్రియను ప్రారంభిస్తుంది. చివరి సిగరెట్ ఆర్పిన కొద్ది నిమిషాల నుంచే ఆరోగ్యపరమైన మార్పులు కనిపించడం మొదలవుతాయి. ధూమపానం మానేసిన కేవలం 20 నిమిషాల తర్వాత గుండె స్పందన రేటు, రక్తపోటు క్రమంగా సాధారణ స్థాయిలకు చేరడం ప్రారంభమవుతుంది. ఇది గుండెపై పడే ఒత్తిడిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.