ఏడేళ్లుగా బాలీవుడ్‌లో సినిమా లేదు.. అయినా టాప్ హీరోయిన్‌గా ప్రియాంక రికార్డు
భారతీయ సినీ పరిశ్రమలో స్టార్‌డమ్‌కు కొత్త నిర్వచనం చెబుతున్న పేరు ప్రియాంక చోప్రా. గత ఏడేళ్లుగా బాలీవుడ్‌లో ఒక్క సినిమా కూడా విడుదల కాకపోయినా, ప్రపంచవ్యాప్తంగా తన బ్రాండ్ విలువను నిలబెట్టుకుంటూ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది . తాజాగా విడుదలైన ఫార్చ్యూన్ ఇండియా–ఇంటర్‌బ్రాండ్ ‘మోస్ట్ వాల్యూబుల్ సెలబ్రిటీస్’ జాబితాలో ప్రియాంక చోప్రా మూడో స్థానంలో నిలిచి మరోసారి తన గ్లోబల్ క్రేజ్‌ను చాటుకుంది.ఈ ప్రతిష్టాత్మక జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ తొలి స్థానాన్ని దక్కించుకోగా, బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ రెండో స్థానంలో నిలిచారు. వీరి తర్వాత మూడో స్థానాన్ని దక్కించుకుంది ప్రియాంక చోప్రా. టాప్-3లో చోటు దక్కించుకున్న ఏకైక మహిళా సెలబ్రిటీగా ప్రత్యేక గుర్తింపు పొందింది.