🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 09 Jun, 2026 | Page: 1

నాగ చైతన్య సూపర్ హిట్ థ్రిల్లర్ సిరీస్‌పై క్రేజీ బజ్

అక్కినేని యువ హీరో నాగ చైతన్య ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఒకవైపు భారీ థ్రిల్లర్ మూవీ ‘వృష కర్మ’లో నటిస్తూనే, మరోవైపు తన కెరీర్‌లో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన ఓటీటీ సిరీస్ ‘దూత’ రెండో సీజన్ కోసం కూడా సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అధికారికంగా ప్రారంభమైన ‘దూత 2’పై రోజురోజుకు ఆసక్తికరమైన వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. దర్శకుడు విక్రమ్ కె కుమార్ తెరకెక్కించిన ‘దూత’ తొలి సీజన్ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణను సొంతం చేసుకుంది. హారర్, మిస్టరీ, థ్రిల్లర్ అంశాల కలయికతో రూపొందిన ఈ సిరీస్ ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా, నాగ చైతన్యకు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఇప్పుడు రెండో సీజన్ మరింత భారీ స్థాయిలో తెరకెక్కనున్నట్లు సమాచారం.
🏠 Home