🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 10 Jun, 2026 | Page: 1

ఆఫ్ఘ‌నిస్తాన్‌తో వ‌న్డే సిరీస్‌కు హార్దిక్ పాండ్యా దూరం

బెంగుళూరు: ఆఫ్ఘ‌నిస్తాన్‌తో జ‌రిగే వ‌న్డే సిరీస్‌కు ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా దూరం కానున్నాడు. అత‌ను స్వ‌ల్పంగా కాలు నొప్పితో బాధ‌ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. పాండ్యా ఫిట్‌నెస్ అంశంలో మంగ‌ళ‌వారమే బెంగుళూరులో సీఓఈ క్లియ‌రెన్స్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. వ‌న్డే సిరీస్‌లో ఆడాల‌న్న ఉద్దేశంతో పాండ్యా చాలా ప్రాక్టీస్ చేశాడు. సెంట‌ర్ ఫ‌ర్ ఎక్స‌లెన్స్‌లో ప‌ది ఓవ‌ర్ల బౌలింగ్ కూడా వేశాడు. వాస్త‌వానికి ఆఫ్ఘ‌న్‌తో సిరీస్‌కు పాండ్యా ఫిట్‌గా ఉన్న‌ట్లు బీసీసీఐ ప్ర‌క‌టించింది కూడా. కానీ అక‌స్మాత్తుగా అత‌ను మ‌ళ్లీ గాయ‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది.

జూన్ 11 నుంచి ఆఫ్ఘ‌నిస్తాన్‌తో జ‌రిగే వ‌న్డే సిరీస్‌లో పాండ్యా ఆడుతార‌ని భావించారు. కానీ తాజాగా కాలు నొప్పి పెర‌గ‌డంతో అత‌ను మ‌రో రెండు వారాల పాటు బెంగుళూరులోనే ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది. చాలా స్వ‌ల్ప స్థాయిలో కాలికి గాయ‌మైంద‌ని, బ‌ల‌హీనంగా ఉన్న కండ‌రాల వ‌ల్ల నొప్పి వ‌స్తోంద‌ని, ఇదేమీ ఎక్కువ రోజులు ఉండే నొప్పి కాదు అని, కానీ బ‌రువు ప‌డ‌కుండా చూసుకోవాల‌ని, బెంగుళూరులోని సీఓఈలోనే ఫిజియోలు, ట్రైన‌ర్ల‌తో పాండ్యా కోలుకోనున్న‌ట్లు ఓ బీసీసీఐ అధికారి చెప్పారు.
🏠 Home