🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 10 Jun, 2026 | Page: 1

బంగ్లా 21 ఏండ్ల తర్వాత

బంగ్లాదేశ్‌ కొత్త చరిత్ర లిఖించింది. తమ సొంత ఇలాఖాలో ఆస్ట్రేలియాను మట్టికరిపించి వన్డేల్లో 21 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. మంగళవారం వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో బంగ్లా 86 పరుగుల తేడాతో (డక్‌వర్త్‌ లూయిస్‌) ఆసీస్‌పై చారిత్రక విజయం సాధించింది. వన్డేల్లో చివరిసారి 2005లో ఆసీస్‌పై గెలిచిన బంగ్లా ఇన్నేండ్లకు మళ్లీ ఆ జట్టును ఓడించింది. తొలుత మొసాదెక్‌ హుస్సేన్‌(70 బంతుల్లో 7ఫోర్లు, 3సిక్సర్లతో 86 నాటౌట్‌)కు తోడు నజ్ముల్‌ హుస్సేన్‌ శాంటో (67), తంజిద్‌ హసన్‌ (54) అర్ధసెంచరీలతో బంగ్లా 50 ఓవర్లలో 284/8 స్కోరు చేసింది.
🏠 Home