🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 10 Jun, 2026 | Page: 1

నైట్‌క్ల‌బ్‌లో బెన్ స్టోక్స్ గొడ‌వ‌.. ప్ర‌మాదంలో కెప్టెన్సీ !

ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్(Ben Stokes) మ‌ళ్లీ గొడ‌వ ప‌డిన‌ట్లు తెలుస్తోంది. తాజాగా టీం ప్రోటోకాల్‌ను అత‌ను ఉల్లంఘించాడు. లార్డ్స్‌లో కివీస్‌పై తొలి టెస్టు గెలిచిన త‌ర్వాత అత‌ను పార్టీ చేసుకున్నాడు. చెల్సీలో నైట్‌క్ల‌బ్‌కు వెళ్లాడు. స్టోక్స్‌తో పాటు గ‌స్ అట్కిన్‌స‌న్ కూడా టీం ఆంక్ష‌ల‌ను ఉల్లంఘించిన‌ట్లు తెలుస్తోంది. సారాసెన్స్ అకాడ‌మీ ర‌గ్బీ ప్లేయ‌ర్‌తో ఇద్ద‌రు క్రికెట‌ర్లు గొడ‌వ ప‌డిన‌ట్లు ఓ నివేదిక ద్వారా తెలిసింది. దీంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఈ ఘ‌ట‌న ప‌ట్ల ఆరా తీస్తున్న‌ది.
🏠 Home