🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 15 Jun, 2026 | Page: 1

సంతాన భాగ్యానికి ఎన్నెన్ని చిక్కులో! - మంచి జీవనశైలితో సాధ్యమట!

ఎంత చదువుకున్న, ఏ స్థాయికి ఎదిగిన, ఎన్ని సాధించిన 'అమ్మా, నాన్న' పిలుపును కోరుకోని వారు ఉండరు. కానీ, మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లు, అధిక రేడియేషన్, ఆలస్యంగా వివాహం చేసుకోవడం వంటి కారణాల చేత చాలా మంది ఈ పిలుపుకు దూరమవుతున్నారు. ఈ క్రమంలోనే గర్భధారణ కోసం ఎంత ప్రయత్నిస్తున్నా.. చాలా మందిలో ఫలితం కనిపించడం లేదట. ఇలాంటి సమయంలో జీవనశైలి ఎలా ఉందో చూసుకోవటం మంచిదంటున్నారు నిపుణులు. ఎందుకంటే సంతానం కలగకపోవటం అనేది ఏదో ఒక్క సమస్యతో ముడిపడి ఉండదని తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో మంచి జీవనశైలితో సంతాన భాగ్యం ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం!

సంతానలేమి పై తీవ్రమైన మానసిక ఒత్తిడి, దీర్ఘకాలంగా నిద్రలేమి, ఎక్కువగా మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లను చూడటం, వేళకు ఆహారం తినకపోవటం, పొగ తాగటం, మద్యం అలవాటు, భార్యభర్తల మధ్య ఆత్మీయత తగ్గటం వంటి రకరకాల అంశాలు ప్రభావం చూపుతాయంటున్నారు నిపుణులు.
🏠 Home