🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 15 Jun, 2026 | Page: 1

సర్ తో.. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కోల్పోకుండా జాగ్రత్త పడాలి..


- అధికారులు అడిగిన అన్ని పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి..

- 16వ వార్డ్ మున్సిపల్ కౌన్సిలర్ ఆలుకూరి పావని

నారాయణపేట జిల్లా జూన్ 15 (బి వి కే న్యూస్)

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు,సర్..ఓటు హక్కు పరిశీలన ప్రక్రియపై 16వ వార్డులో స్థానిక కౌన్సిలర్ ఆలుకూరి పావని, మరియు కాంగ్రెస్ నాయకుల సమన్వయంతో విస్తృత ప్రచారం

కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 25వ తేదీ నుంచి చేపట్టబోతున్న సర్... ఓటు హక్కు పరిశీలన కార్యక్రమంపై ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించుకోవాలని, ఇందులో భాగంగా తమ ఇళ్ల వద్దకు వచ్చిన అధికారులకు ఓటు హక్కుతో పాటు సంబంధిత పత్రాలను సిద్ధంగా ఉంచుకొని వారికి చూయించి... ఓటు హక్కు కోల్పోకుండా ఉండేలా చూసుకోవాలని 16 వార్డ్ కౌన్సిలర్ అల్కురి పావని, ప్రజలకు సూచించారు.

ఈ సందర్భంగా 16వ వార్డులో ఇంటింటికి తిరుగుతూ.. సర్ ప్రక్రియపై అవగాహన కల్పించారు. కేంద్ర ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా సర్ ప్రక్రియ ద్వారా చాలా రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో ఓట్లను తొలగించిందని... అందుకే ఒక్క ఓటు కూడా దుర్వినియోగం కాకుండా... అధికారులు అడిగిన అన్ని పత్రాలను చూయించి... ఒక ఓటు కూడా కోల్పోకుండా ఉండేలా సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ప్రతి ఒక్కరికి ఓటు హక్కు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని, దురుద్దేశ పూర్వకంగా ఎవరైనా తొలగించడానికి ప్రయత్నించిన వాటిని అడ్డుకొని న్యాయ పద్ధతిలో ఓటు హక్కును నిలుపుకునేందుకు ప్రతి ఒక్కరూ కంకణ బద్ధులై ఉండాలని సూచించారు. సర్ ప్రక్రియపై అందరూ అవగాహన పెంచుకొని, ఇతరులకు సైతం అవగాహన కల్పించాలని సూచించారు. అధికారులకు అన్ని విధాలుగా సహకరించి, వారు అడిగిన అన్ని పత్రాలను చూయించి, రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కును నిలుపుకోవాలని కోరారు.

వారితోపాటు మక్తల్ మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు వల్లంపల్లి లక్ష్మణ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శాలం ,స్థానిక నాయకులు మహమ్మద్ రంజాన్, మహమ్మద్, సలీం, రాజశేఖర్, బస్సలింగం, వీరన్న తదితరులు ఉన్నారు.
🏠 Home