🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 16 Jun, 2026 | Page: 1

సర్ ప్రక్రియపై సందేహాలు ఉన్నాయా? - సమాధానాలు ఇవే!

రాష్ట్రంలో ఈనెల 25 నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్​ఐఆర్​)ను చేపట్టనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్నీ ఏర్పాట్లు అయ్యాయి. కానీ దీనిపై ఓటర్లలో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సర్​పై రాజకీయ పార్టీల నుంచి కూడా కొన్ని విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ క్రమంలో ఓటర్లు తరచూ అడుగుతున్న ప్రశ్నలకు సర్​ అధికారులు సమాధానమిచ్చారు. దీనికి సంబంధించి సోమవారం ఓ ప్రకటనను విడుదల చేశారు. ఓటర్ల ప్రశ్నలకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఇచ్చిన సమాధానలు ఇవే.

ఎస్​ఐఆర్​ అంటే ఏంటి? : ఓటర్లు వలస వెళ్లడం లేదా మృతి చెందటం అలాగే మరో చిరునామాకు మారడం వంటి వాటిపై సమగ్ర సర్వే జరుపుతారు. ఆ తర్వాత అర్హులైన వారిని మాత్రమే ఉంచి, అనర్హులను తొలగిస్తారు. దీనినే సర్​ ప్రక్రియ అంటారు. మరి దీనిని ఈసారి ఏ పద్ధతిలో నిర్వహిస్తున్నారనే దానిపై అధికారులు మరింత స్పష్టంగా వివరించారు.
🏠 Home