🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 17 Jun, 2026 | Page: 1

ప్రభుత్వ పాఠశాలల్లో చదవటం నామోషీ అనే ఆలోచన పోవాలి:

ప్రభుత్వ పాఠశాలల ద్వారా మట్టిలో మాణిక్యాలను వెలికితీస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈరోజు(బుధవారం) జిల్లాలోని ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ను సీఎం ప్రారంభించారు. కార్పొరేట్‌ స్థాయిలో ప్రభుత్వ స్కూల్‌ను సర్కార్ నిర్మించింది. స్కూల్ ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ.. ఆరుట్ల పాఠశాలను పైలట్‌ ప్రాజెక్టుగా నిర్మించామని తెలిపారు. విద్యాశాఖపై ప్రభుత్వం రూ.27 వేల కోట్లు ఖర్చు చేస్తోందని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యపై తల్లిదండ్రులకు అపోహలు ఉన్నాయని.. అందరి అపోహలు తొలగించేందుకే టీపీఎస్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకే విద్యా కమిషన్‌ వేశామని ముఖ్యమంత్రి తెలిపారు. విద్య మాత్రమే మన జీవితాలను సమూలంగా మార్చగలదన్నారు. విద్య ఖర్చు కాదని.. పెట్టుబడి అని చెప్పుకొచ్చారు. విద్యతో సమాజంలో మార్పు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నామన్నారు. సమాజంలో అసమానతలు పోవాలంటే అందరికీ నాణ్యమైన విద్య అవసరమని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ బడుల్లో చదివి ఐఏఎస్‌, ఐపీఎస్‌, సీఎంలు అయినవాళ్లు ఉన్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదవటం నామోషీ అనే ఆలోచన పోవాలని అన్నా
🏠 Home