బెంగాల్ బ్లాక్‌బస్టర్ షో.. అన్‌సంగ్ హీరో మిథున్ చక్రవర్తి
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చారిత్రక విజయానికి చాలా కాలం ముందు నుంచే జనంతో ఆయన మమేకమయ్యారు. పార్టీ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించారు. బెంగాల్‌లో మార్పునకు 2026 ఎన్నికల్లో పిలుపునిచ్చారు. పశ్చిమబెంగాల్‌లో బీజేపీకి అఖండ విజయం సాధించిన పెట్టిన 'అన్‌సంగ్ హీరో'లలో ఒకరుగా నిలిచారు. ఆయనే మిథున్ దా అలియాస్ మిథున్ చక్రవర్తి.
2026లో కిరీటం మనదే (బీజేపీ). ఆ లక్ష్య సాధనకు ఏమి చేయలో అది చేరి తీరుతాం' అని మిథున్ చక్రవర్తి 2024లోనే ప్రకటించారు. ఆ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్‌లో టీఎంసీ హహా కొనసాగి, బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. అయితే మిథున్ మాత్రం 2026లో అధికారం మనదేనంటూ జోస్యం చెప్పారు. పార్టీని అట్టడుగు వర్గాల ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఆయన చెప్పినట్టు టీఎంసీ 15 ఏళ్ల పాలనకు ప్రజలు ఇటీవల ఉద్వాసన పలికారు. బెంగాల్‌లో బీజేపీ అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు-2026 ప్రచారం యావత్తు టీఎంసీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు. ప్రధానమంత్రి మోదీ ఇమేజ్ చుట్టూనే తిరిగింది. ఇదే సమయంలో మిథున్ చక్రవర్తి ఇమేజ్ పలు రకాలుగా పార్టీ విజయానికి ఊతమిచ్చింది. 1980, 1990 దశకంలో ఆయన సినిమాలు చూస్తూ పెరిగిన యువత మిధున్‌ను 'మహానాయక్'తో సరిపోలుస్తూ ఆయన పట్ల విశేష ఆదరణ కనబరిచారు. బెంగాల్‌లో సినిమా, రాజకీయాలు ఒకదానితో మరొకటి ముడిపడి ఉంటాయి. బీజేపీ విజయానంతరం ప్రధాని మోదీ అభినందనలను మిథున్ అందుకున్నారు. మోదీ, మిథున్ పక్కపక్కనే కనిపించడం, మిథున్‌తో ప్రధాని ఆప్యాయంగా ముచ్చటించి, కరచాలనం చేయడం అందరి దృష్టిని విశేషంగా ఆకర్షించింది.
మిథున్‌కు ఆర్ఎస్ఎస్‌తోనూ చిరకాల అనుబంధం ఉంది. 2019లో ఆయన ఆర్ఎస్ఎస్ సంఘ్‌చాలక్ మోహన్ భాగవత్‌ను నాగపూర్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో కలుసుకున్నారు. 2021 ఫిబ్రవరిలో తన ముంబై నివాసంలో మోహన్ భాగవత్‌కు బ్రేక్‌ఫాస్ట్ ఇచ్చారు. పశ్చిమబెంగాల్ దశాబ్దాలుగా బీజేపీ అధికారంలోకి రావాడానికి ప్రయత్నాలు సాగించినా సింగిల్ డిజిట్ సీట్లు సాధించడం కూడా కష్టంగా ఉండేది. ఈ తరుణంలో మిథున్‌ను పార్టీ వైపు రావాల్సిందిగా బీజేపీ కోరింది. పూర్తి స్థాయిలో ప్రచారం సాగించే వీలులేకుంటే సెలబ్రిటీ ఫేస్‌గా జనంలోకి పార్టీ తరఫున వెళ్లాలని సూచించింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలకు వ్యతిరేకంగా 2026 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మిథున్ తన గళం బలంగా వినిపించారు. మిధున్ చక్రవర్తి ఒంట్లో చివరి రక్తం బొట్టు ఉన్నంత వరకూ రాష్ట్రాన్ని బంగ్లాదేశ్ కానీయమంటూ ఆయన ప్రచారం సాగించారు.
కోల్‌కతాలోని 1950లో గౌరాంగ చక్రవర్తి (మిథున్ చక్రవర్తి) జన్మించారు. 1960, 70 దశకాల్లో అప్పటి బెంగాలీ యువతరం తరహాలోనే ఆయన కూడా నక్సలైట్ ఉద్యమం పట్ల ఆకర్షితులయ్యారు. రాడికల్ లెఫ్ట్ రాజకీయాల వైపు మళ్లారు. అయితే ఆయన సోదరుడు ఒక ప్రమాదంలో మరణించినప్పటి నుంచి నక్సల్స్ ప్రపంచానికి మిథన్ దూరమయ్యారు. సినిమాల వైపు దృష్టిసారించారు. పుణెలోని ఎఫ్‌టీఐఐలో శిక్షణ తీసుకుని ప్రముఖ దర్శకుడు మృణాల్ సేన్ 'మృగయా' చిత్రంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. గిరిజన హంటర్‌గా ఆందులో చేసిన పాత్రకు గాను ఉత్తమనటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. తొలినాళ్లలో ఆయన ధరించిన పాత్రలు ప్రభుత్వాలను నిలదీసే తరహాలో ఉండేవి. ఆ తరువాత సమాంతర సినిమా నుంచి క్రమంగా మాస్ స్టార్‌డమ్ వైపు ఆయన ప్రయాణం సాగింది. 1982లో వచ్చిన 'డిస్కో డాన్సర్' చిత్రం యువతను ఉర్రూతలూగించింది. ఇండియాలోనే కాకుండా సోవియట్ యూనియన్, ఈస్ట్రన్ యూరప్‌లోని పలు చోట్ల పెద్ద విజయం సాధించింది. ఆ తర్వాత ఆయన నటించిన పలు చిత్రాలు ప్రజాదరణ పొంది 2024లో ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు.