🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 18 Jun, 2026 | Page: 1

భారత హాకీ స్టార్ మన్‌ప్రీత్ సింగ్‌ సరికొత్త రికార్డు..

భారత హాకీ జట్టు (Indian Hockey Team) స్టార్ ఆటగాడు మన్‌ప్రీత్ సింగ్ (Mann Preet Singh) చరిత్ర సృష్టించాడు. దేశం తరఫున అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. నెదర్లాండ్స్‌లోని రోటర్‌డామ్‌లో జర్మనీతో జరిగిన ఎఫ్‌ఐహెచ్ హాకీ ప్రో లీగ్ మ్యాచ్‌లో బరిలోకి దిగడం ద్వారా మన్‌ప్రీత్ తన 413వ మ్యాచ్ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో హాకీ ఇండియా ప్రస్తుత అధ్యక్షుడు దిలీప్ టిర్కీ పేరిట ఉన్న 412 మ్యాచ్‌ల రికార్డును మన్‌ప్రీత్ అధిగమించాడు.
ఈ చారిత్రక ఘనతను గుర్తిస్తూ హాకీ ఇండియా.. మన్‌ప్రీత్ సింగ్‌ను అభినందించి, రూ.10 లక్షల నగదు బహుమతిని ప్రకటించింది. పదిహేనేళ్లుగా భారత హాకీ జట్టుకు మన్‌ప్రీత్ గుండెకాయలా నిలుస్తున్నాడని, ఆయన నిలకడ అసాధారణమని కొనియాడింది. 2011లో 19 ఏళ్ల వయసులో భారత జట్టులోకి అడుగుపెట్టిన మన్‌ప్రీత్, టోక్యో, పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాలు సాధించిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ప్రపంచంలోనే అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో మన్‌ప్రీత్ ఐదో స్థానంలో నిలువడం విశేషం.
🏠 Home