ఓ మనిషి నీజీవితం
ఆనంద లహరి కావాలి
మనిషి జీవిత చక్రంలో
ఆందోళనలు ఆనందాలు
అంతర్భాగాలు
ఓమనిషి రేపటి కొరకు
ఎదురుచూస్తూ
ఈ క్షణాన్ని వృథాచేయకు
మీనా మేషాలు లెక్కిస్తూ
కూర్చోకు సకాలంలో
స్పందించే శక్తిని పెంచుకో
ఇప్పుడు చేయాల్సిన
పని మీద దృష్టిపెట్టు
ఆనందం అంగడి
సరుకుకాదు
కొంటె మార్కెట్లో దొరకదు
ఆనందం అనేది మనసులో
పుడుతుంది ఆనందం అనేది
ఒక కళ దానిని ఇప్పుడే
ఆస్వాదించడం మరవద్దు
డబ్బులో లేదు అసలైన
సంతోషం మనసు విప్పి
మాట్లాడే స్నేహంలో ఉంది
చిన్న నాటి స్నేహితుల
చిలిపిచేష్టలజ్ఞాపకాల్లో ఉంది
పాత స్నేహితుల మాటల్లోఉంది
అలసటను మరిపించే
అమ్మ ప్రేమలో ఉంది
తోడుగా నిలిచే నాన్న
ధైర్యంలో ఉంది
ఆత్మీయుల పలకరింపులో
ఉంది
ఉదయాన్నే చేసే చక్కని
వ్యాయామంలో ఉంది
శ్వాసపై ధ్యాస ధ్యానంతో
శరీరానికిచ్చే కొత్త
ఉత్సాహంలో ఉంది
యోగాసనాలతో పొందే
మనశ్శాంతిలో ఉంది
ఆరోగ్యమే మహా భాగ్యం
అనే జీవనశైలిలో ఉంది
కొత్తలోకాన్ని చూపే
ప్రయాణాల్లో ఉంది
తెలియని దారుల్లో సాగే
అన్వేషణల్లో ఉంది
కొండలు కొనలు దాటి
పారే జలపాతాల్లో ఉంది
ప్రకృతి అందాలను చూసి
పరవశించడంలో ఉంది
ప్రకృతి ఒడిలో
సముద్రపు తీరాల్లో
పచ్చని చెట్లలో పక్షుల
కిలకిల రావాల్లో ఉంది
పసిపాప అమాయకపు
చిరునవ్వులో ఉంది
పరులకుచేసేసహాయంలో ఉంది
నిస్వార్థ స్వచ్ఛంద సేవలో ఉంది
కష్టాల్లో ఉన్న వారిని
ఆదుకునే హృదయంలో ఉంది
నచ్చినపుస్తకంచదవడంలో ఉంది
మనసుకు నచ్చిన
సంగీతం వినడంలో ఉంది
మనపై మనకున్న
విశ్వాసంలోనే
సంతృప్తి సంతోషం ఉంది
దాచిపెడితే పెరగదు సంతోషం
సంతోషాన్నీ పెంచాలి పంచాలి
అప్పుడే సంతోషం ఆనందం
రెట్టింపు అవుతుంది
మానవ జన్మ సార్ధకమౌతుంది
వాయిదా పద్ధతిని కాలానికి
వదిలేయ్ ఈ క్షణంలోనే
మనస్పూర్తిగా బతికేయ్
ఈ క్షణాన్ని ఆస్వాదిస్తేనే
సంతోషాన్ని ఆనందాన్ని
అనుభవిస్తాం
చింతలకు దూరంగా
ప్రశాంతతకు దగ్గరగా
జీవిద్ధాం మానవ జన్మ
సార్థకతకు స్పూర్తిగా
నిలుద్దాం
నేదునూరి కనకయ్య
ఫ్రీలాన్స్ జర్నలిస్ట్
కరీంనగర్9440245771
మనిషి జీవిత చక్రంలో
ఆందోళనలు ఆనందాలు
అంతర్భాగాలు
ఓమనిషి రేపటి కొరకు
ఎదురుచూస్తూ
ఈ క్షణాన్ని వృథాచేయకు
మీనా మేషాలు లెక్కిస్తూ
కూర్చోకు సకాలంలో
స్పందించే శక్తిని పెంచుకో
ఇప్పుడు చేయాల్సిన
పని మీద దృష్టిపెట్టు
ఆనందం అంగడి
సరుకుకాదు
కొంటె మార్కెట్లో దొరకదు
ఆనందం అనేది మనసులో
పుడుతుంది ఆనందం అనేది
ఒక కళ దానిని ఇప్పుడే
ఆస్వాదించడం మరవద్దు
డబ్బులో లేదు అసలైన
సంతోషం మనసు విప్పి
మాట్లాడే స్నేహంలో ఉంది
చిన్న నాటి స్నేహితుల
చిలిపిచేష్టలజ్ఞాపకాల్లో ఉంది
పాత స్నేహితుల మాటల్లోఉంది
అలసటను మరిపించే
అమ్మ ప్రేమలో ఉంది
తోడుగా నిలిచే నాన్న
ధైర్యంలో ఉంది
ఆత్మీయుల పలకరింపులో
ఉంది
ఉదయాన్నే చేసే చక్కని
వ్యాయామంలో ఉంది
శ్వాసపై ధ్యాస ధ్యానంతో
శరీరానికిచ్చే కొత్త
ఉత్సాహంలో ఉంది
యోగాసనాలతో పొందే
మనశ్శాంతిలో ఉంది
ఆరోగ్యమే మహా భాగ్యం
అనే జీవనశైలిలో ఉంది
కొత్తలోకాన్ని చూపే
ప్రయాణాల్లో ఉంది
తెలియని దారుల్లో సాగే
అన్వేషణల్లో ఉంది
కొండలు కొనలు దాటి
పారే జలపాతాల్లో ఉంది
ప్రకృతి అందాలను చూసి
పరవశించడంలో ఉంది
ప్రకృతి ఒడిలో
సముద్రపు తీరాల్లో
పచ్చని చెట్లలో పక్షుల
కిలకిల రావాల్లో ఉంది
పసిపాప అమాయకపు
చిరునవ్వులో ఉంది
పరులకుచేసేసహాయంలో ఉంది
నిస్వార్థ స్వచ్ఛంద సేవలో ఉంది
కష్టాల్లో ఉన్న వారిని
ఆదుకునే హృదయంలో ఉంది
నచ్చినపుస్తకంచదవడంలో ఉంది
మనసుకు నచ్చిన
సంగీతం వినడంలో ఉంది
మనపై మనకున్న
విశ్వాసంలోనే
సంతృప్తి సంతోషం ఉంది
దాచిపెడితే పెరగదు సంతోషం
సంతోషాన్నీ పెంచాలి పంచాలి
అప్పుడే సంతోషం ఆనందం
రెట్టింపు అవుతుంది
మానవ జన్మ సార్ధకమౌతుంది
వాయిదా పద్ధతిని కాలానికి
వదిలేయ్ ఈ క్షణంలోనే
మనస్పూర్తిగా బతికేయ్
ఈ క్షణాన్ని ఆస్వాదిస్తేనే
సంతోషాన్ని ఆనందాన్ని
అనుభవిస్తాం
చింతలకు దూరంగా
ప్రశాంతతకు దగ్గరగా
జీవిద్ధాం మానవ జన్మ
సార్థకతకు స్పూర్తిగా
నిలుద్దాం
నేదునూరి కనకయ్య
ఫ్రీలాన్స్ జర్నలిస్ట్
కరీంనగర్9440245771