🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 20 Jun, 2026 | Page: 1

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు.

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్(ఎండీ) వేమూరి రాధాకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సీఎం విషెస్ తెలిపారు. జర్నలిజంలో రాధాకృష్ణ ప్రస్థానం ఎందరికో ఆదర్శమని కొనియాడారు. రాధాకృష్ణ మరెన్నో విజయాలు సాధించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
‘ప్రతి అక్షరం ప్రజల పక్షం. పాత్రికేయంతో సమాజహితం సిద్ధాంతంగా నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగు మీడియా రంగంలో తనదైన ముద్ర వేసిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆంధ్రజ్యోతి దినపత్రిక, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్‌ను విజయవంతంగా నడిపిస్తూ, నిజాలను నిర్భయంగా ప్రజల ముందుంచే జర్నలిజం ఆయనది. ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’, ‘కొత్తపలుకు’ వంటి వేదికల ద్వారా సమకాలిన అంశాలపై ప్రజలను ఆలోచింపజేస్తారు. జర్నలిజంలో రాధాకృష్ణ ప్రస్థానం ఎందరికో ఆదర్శం. ఆయన ఆయురారోగ్యాలతో, ఆనందంగా, మరెన్నో విజయాలు సాధిస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను’ అని ఎక్స్‌లో సీఎం చంద్రబాబు పోస్ట్ చేశారు.
🏠 Home