ఆరోగ్య యోగం కోసం యోగాభ్యాసం
(21 జూన్ “అంతర్జాతీయ యోగా దినోత్సవం” సందర్భంగా)
అష్టఐశ్వర్యాలు, విలాసవంతమైన సౌకర్యాలు ఎన్ని ఉన్నా ఆరోగ్యం జతకూడని జీవితాలు దుర్భరమే కదా. అనారోగ్యం చుట్టుముట్టినపుడు ఆరోగ్యం ప్రాధాన్యత అవగతం అవుతుంది. లక్షల ఖరీదైన మంచం, పరుపులు ఉన్నప్పటికీ పడుకోగానే నిద్రరాని వారు అభాగ్య నిరుపేదలే అవుతారు. ఔషధాలు కొనవచ్చు కాని, ఆరోగ్యాన్ని కొనలేము అన్నటికీ. ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్య సంరక్షణకు గొడుగులు పట్టాలి. నిత్యం ఓ గంట లేదా అరగంట ఆరోగ్య భాగ్యానికి కేటాయించాలి. జ్వరం లేకపోవడం ఆరోగ్యంగా ఉన్నట్లు కాదని తెలుసుకోవాలి. ‘యోగా’ అనే పదానికి అర్థం ‘ఐక్యత’ లేదా ‘కలయిక’ అని తెలుసుకోవాలి. ఒక వ్యక్తి శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, భావోద్వేగభరితంగా, సామాజికంగా, సాంస్కృతికంగా సమతుల్యంగా ఉన్నపుడే పూర్తి ఆరోగ్యం, శ్రేయస్సు (వెల్-బీయింగ్) ఒనగూడుతుందని ఐరాస - డబ్ల్యూహెచ్ఓ నిర్వచించింది. సనాతన భవ్య భారతానికి సంపూర్ణ ఆరోగ్యాన్ని బహుకరిస్తున్న యోగా నినాదంగా “సర్వే సంతు నిరామయ (రోగాలకు దూరంగా ప్రజానీకం)” ధ్వనిస్తున్నది.
ఒకే భూమి, ఒకే ఆరోగ్యం కోసం యోగాభ్యాసం:
సనాతనం భారత నాగరికత ప్రపంచ మానవాళికి అందించిన దివ్య ఆరోగ్య అస్త్రంగా “యోగా ప్రక్రియ” నేడు ప్రపంచవ్యాప్తంగా బహుళ ప్రచారం పొందుతున్నది. శాస్త్రీయ పద్దతుల్లా శరీర అవయవాల కదలికలు, శ్వాస క్రియలు, ఏకాగ్రతకు ఉపకరించే శారీరక-మానసిక శ్రేయస్సు కోసం పాటించే అభ్యాసాలను వివరించే శాస్త్రమే “యోగా ప్రక్రియ” అని అర్థం చేసుకోవాలి. యోగా ప్రాధాన్యాన్ని గుర్తించిన ఐరాస తీసుకున్న తీర్మానం ప్రకారం ప్రతి ఏట 21 జూన్‌న “అంతర్జాతీయ యోగా దినోత్సవం (ఇంటర్నేషనల్ యోగా డే)” పాటించుట 21 జూన్ 2015 నుంచి ఆనవాయితీగా మారింది. అనారోగ్యాల నుంచి ఆరోగ్యం వైపు, ఆరోగ్యాన్ని ఆలింగనం చేసుకోవడం, మానసిక వికాసం పొందడం, పూర్తి మానవ శ్రేయస్సుకు ఉపకరించడమే లక్ష్యంగా యోగా వినియోగపడుతున్నది. అంతర్జాతీయ యోగా దినోత్సవం-2026 ఇతివృత్తంగా “ఆరోగ్యకర వృద్ధాప్యం కోసం యోగాభ్యాసం (యోగా ఫర్ హెల్తీ ఏజింగ్)” అనబడే అంశాన్ని ఎంపిక చేసి ప్రచారం నిర్వహిస్తున్నారు. పర్యావరణ ఆరోగ్యంతో మానవాళి ఆరోగ్యం ఆధారపడి ఉందని, భూమాతను పరిశుభ్రంగా ఉంచినపుడే జీవకోటి ఆరోగ్యం సిద్ధిస్తుందని మనకు తెలుసు. యోగాభాస్యం చేసుకుంటూ, భూగ్రహం కాలుష్యన్ని కట్టడి చేసుకుంటూ మానవాళి ఆయురారోగ్యాలతో జీవితాలను కొనసాగించాలని ఈ వేదిక ప్రచారం చేస్తున్నది.
యోగాశాస్త్ర బహుళ ప్రయోజనాలు:
యోగాభ్యాసం ఆచరించిన వారికి శరీర అవయవాలు తేలికగా కదలడం, శరీరం దృఢ పడడం, కండరాలు-కీళ్లు బలపడడం, అవయవ సమతుల్యత/సమన్వయం పెరగడం, హృదయ ఆరోగ్యం మెరుగుపడడం, శ్వాస క్రియ గాడిన పడడం, పలు రకాల నొప్పులు తగ్గడం, జీవనశైలి రుగ్మతలైన బిపీ-షుగర్లు అదుపులో ఉండడం లాంటి శారీరక ప్రయోజనాలు కలుగుతాయి. వీటికి తోడుగా ఒత్తిడి-ఆందోళన-ఆవేదనలు తగ్గడం, మూడ్ స్థిరంగా ఉండడం, నాణ్యమైన నిద్ర రావడం, ఏకాగ్రత-స్పష్టత పెరగడం, భావోద్వేగ నియంత్రణ ఫలించడం, మానసిక ప్రశాంతత ఒనగూడడం లాంటి మానసిక ప్రయోజనాలు యోగాభ్యాసం వల్ల కలుగుతాయి. ఇలా శారీరక సమతుల్యతతో మానసిక సమన్వయం కూడా జతకూడితే పూర్తి శ్రేయస్సు కలుగుతుందనితెలుసుకోవాలి. వీటికి తోడుగా యోగా బోధనలో భాగంగా కాలుష్యరహిత జీవన విధానం కూడా పరిచయం చేయడం జరుగుతుందని తెలుసుకోవాలి. ఎముకలకు సంబంధించిన చికిత్సలు, స్ట్రోక్ రికవరీ, దీర్ఘకాలిక బెడ్ రెస్ట్ తీసుకోవడం, నొప్పులకు వైద్యం, క్యాన్సర్ రికవరీ, ప్రసవం అయిన అనారోగ్య తల్లులు లాంటి వారు పరిమిత స్థాయిలో నిపుణుల సమక్షంలో యోగా పాటిస్తే ఆరోగ్యం మెరుగు పడుతుందని తెలుసుకోవాలి.
అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు:
తొలిసారి యోగా చేస్తున్న వ్యక్తులకు పరిచయం చేసే యోగాసన ప్రక్రియల్లో తాడాసనా, బాలాసనా, భుజంగాసనా, మార్జరియాసన-బిటిలాసనా, సుఖాసనా, సేతుబంధాసనా లాంటివని బహుళ ప్రచారం పొందాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేదికగా స్థానికంగా యోగా శిబిరాల నిర్వహణ, ఆన్‌లైన్ తరగతులు, హరిత యోగా, మాస్ యోగా, శ్వాసక్రియ అభ్యాసాలు, యోగా ప్రయోజనాల పట్ల అవగాహనలు-కార్యశాలలు-సదస్సులు, యోగా ప్రక్రియలో దాగిన అనంత శక్తిని వివరించడం లాంటి కార్యక్రమాలను నిర్వహించాలి. రోజూ గంట తరబడి సమయం వెచ్చించాల్సిన పని లేదని, కనీసం 30 నిమిషాల యోగా ఏకాగ్రత సరిపోతుందని మనందరం తెలుసుకోవాలి.
ఒకే సారి ఒక భంగిమ, ఒక శ్వాస, ఒక కదలిక చేయడమే యోగా ప్రక్రియకు పునాది.ఆరోగ్యకర ధరిణితో మానవుడు స్నేహం చేసినపుడే జీవకోటి సంపూర్ణ ఆరోగ్యం ఫలిస్తుందని తెలుసు కోవాలి. యోగాకు మన జీవనశైలిలో తగు సమయాన్ని ఇవ్వాలి, సంపూర్ణ శ్రేయస్సును పొందాలి.
డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి
9949700037