యోగా డే వేడుకల్లో శ్రీలీలకు అవమానం..
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ముంబైలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత ఫడ్నవీస్, బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీలతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని యోగాసనాలు చేశారు. అయితే కార్యక్రమం ముగిసిన అనంతరం జరిగిన ఒక చిన్న సంఘటన ఇప్పుడు నెట్టింట పెద్ద వివాదంగా మారింది. యోగా కార్యక్రమం అనంతరం అమృత ఫడ్నవీస్, ఆమె కుమార్తె, శ్రీలీల కలిసి మీడియా ఫోటోగ్రాఫర్లకు ఫోజులు ఇచ్చారు. ఈ సందర్భంగా కొందరు ఫోటోగ్రాఫర్లు కేవలం అమృత ఫడ్నవీస్, ఆమె కుమార్తెతో మాత్రమే ఫోటోలు కావాలని కోరినట్లు తెలుస్తోంది.
దీంతో పక్కనే నిలబడి ఉన్న శ్రీలీలకు అమృత ఫడ్నవీస్ చేతి సైగతో పక్కకు జరగమని సూచించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ సమయంలో శ్రీలీల కొంత అసౌకర్యానికి గురైనట్లు కనిపించడంతో నెటిజన్లు దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత పలువురు నెటిజన్లు అమృత ఫడ్నవీస్ వ్యవహారాన్ని విమర్శిస్తున్నారు. ఒక ప్రముఖ నటి పట్ల మరింత మర్యాదపూర్వకంగా వ్యవహరించాల్సిందని అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం అది కేవలం ఫోటో సెషన్‌లో జరిగిన సాధారణ సంఘటన మాత్రమేనని, దానిని అనవసరంగా పెద్ద వివాదంగా మార్చుతున్నారని అంటున్నారు. ఈ ఘటనపై ఇప్పటివరకు శ్రీలీల లేదా అమృత ఫడ్నవీస్ ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వలేదు.