🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 23 Jun, 2026 | Page: 1

గతంలో బీసీ స్టడీ సర్కిల్ కు కేటాయించిన భూమిని బీసీ సంక్షేమ వసతిగృహాలకు కేటాయించాలని జిల్లా బీసీ సంక్షేమ అధికారికి బీసీ సంఘాల పక్షాన విజ్ఞప్తి.

గతంలో సప్తగిరి కాలనీలో బీసీ స్టడీ సర్కిల్ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని బీసీ సంక్షేమ వసతి గృహాల పక్కాభవనాల నిర్మాణానికి కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా బీసీ సంక్షేమ అధికారికి ఈరోజు బీసీ సంఘాల పక్షాన విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు కేశిపెద్ది శ్రీధర్ రాజు , దొగ్గలి శ్రీధర్, మాదాస్ సంజీవ్ , మియాపురం రవీంద్ర చారి లు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ యొక్క భూమిని ప్రభుత్వ బీసీ సంక్షేమ వసతి గృహాలకు కేటాయించే విధంగా ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్తామని జిల్లా బీసీ సంక్షేమ అధికారి హామీ ఇచ్చినట్లు తెలియజేశారు గతంలో బీసీ స్టడీ సర్కిల్ నిర్మాణానికి 10 గుంటల స్థలాన్ని సప్తగిరి కాలనీలో అప్పటి పార్లమెంటు సభ్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు కేటాయించినారు అదేవిధంగా నిర్మాణానికి రెండు కోట్ల నిధులు కూడా కేటాయించినారు కానీ అనివార్య కారణాలవల్ల అక్కడ నిర్మాణం జరగలేదు ఉజ్వల పార్క్ సమీపంలో బీసీ స్టడీ సర్కిల్ నిర్మాణం జరిగినది అప్పటినుండి ఈ స్థలం ఖాళీగా ఉన్నది నగరంలో 8 కి పైగా బీసీ సంక్షేమ వసతి గృహాలు అద్దె భవనాలలో ఉన్నవి దాదాపు ఒక్కో వసతి గృహంలో 200 మంది విద్యార్థులు ఉంటున్నారు ఇలా ప్రైవేట్ భవనాలలో అరకురా వసతులతో ఉంటున్నారు ఈ యొక్క భూమిని ప్రభుత్వ పక్కాభవనాలకు కేటాయించితే భవనిర్మానాలు జరిగితే విద్యార్థులకు అనేక సౌకర్యాలు ఉంటాయి. దీని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క స్థలాన్ని కేటాయించాలని బీసీ సంఘాల పక్షాన కోరడం జరిగింది
🏠 Home