🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 24 Jun, 2026 | Page: 1

కుల మతాలకతీతంగా మక్తల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం



- నేడు పడమటి అంజన్న రాజగోపురం, ఈదుగా ప్రహరీ నిర్మాణానికి భూమి పూజ చేయడం నా అదృష్టం

- నేను ఈ స్థాయికి ఎదగడానికి మీరే కారకులు

- స్థానికుడిగా, అభివృద్ధి లక్ష్యంగా నిరంతరం పనిచేయడానికే నేనున్నాను

- అభివృద్ధి చేయడానికి అడ్డు పుల్ల వేస్తే నష్టపోయేది మనమే

- ఈద్గా ప్రహరీ గోడ భూమి పూజలో మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి

నారాయణపేట, జూన్ 24 (బి వి కే న్యూస్)

కులమతాలకతీతంగా మక్తల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో పయనింపజేస్తానని నేడు పడమటి అంజన్న రాజగోపురం, ఈదుగా ప్రహరీ నిర్మాణానికి భూమి పూజ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నానని,నేను ఈ స్థాయికి ఎదగడానికి మీరే కారకులని, స్థానికుడిగా, అభివృద్దే లక్ష్యంగా నిరంతరం పనిచేయడానికే నేనున్నానని, అభివృద్ధి చేయడానికి అడ్డు పుల్ల వేస్తే నష్టపోయేది మనమే అంటూ
స్పష్టం చేశారు రాష్ట్ర క్రీడా, పాడి పరిశ్రమాభివృద్ధి, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి.
పట్టణంలోని ఈద్గా వద్ద రూ.36 లక్షలతో నిర్మించనున్న ప్రహరీ గోడకు మంత్రి వాకిటి శ్రీహరి భూమి పూజ గావించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...


73 ఏళ్ళ తర్వాత తొలిసారిగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం మక్తల్ ప్రాంత వాసినైన నాకు సేవ చేసే అవకాశం కల్పించిన మీ అందరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు.

ప్రార్థన మందిరాలను బాగు చేసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందన్నారు. ఎంత పెద్ద నాయకులైనా సరే మన ప్రాంతాలను అభివృద్ధి చేసుకోకపొతే జీవితానికి అర్థం ఉండదని స్పష్టం చేశారు.

ఇప్పటికే మక్తల్ ప్రాంతం అన్ని రంగాల్లో వెనుకబాటుతనానికి గురైందని ఆవేదన వ్యక్తం చేశారు.
అన్ని కులాల, మతాల ప్రజలను సమానంగా అభివృద్ధి చేయాలన్నదే తన ధ్యేయమన్నారు.కులాల మధ్య,మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు కొందరు ప్రయత్నం చేస్తారని వాటిని తిప్పి కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
రాజకీయాలను పక్కనపెట్టి మక్తల్ ప్రాంత అభివృద్ధి కోసం అందరూ కలిసి రావాలని ప్రతిపక్షాలకు సూచించారు. ఎన్నికల వరకే రాజకీయాలని, ఇప్పుడు దృష్టి అంతా మక్తల్ అభివృద్ధి పైనే ఉండాలన్నారు మంత్రి వాకిటి శ్రీహరి.

ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరితో పాటు మున్సిపల్ చైర్ పర్సన్ వాకిటి మానస హనుమంతు, ఏడ వాడు కౌన్సిలర్ శ్రీవిద్య నీల గౌడ్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవి కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కోళ్ల వెంకటేష్ స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, మైనార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home