🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 25 Jun, 2026 | Page: 1

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

: మక్తల్ ఎస్ఐ రాజు

నారాయణపేట, జూన్ 25 (బీవీకే న్యూస్)

జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ ఆదేశాల మేరకు మక్తల్ పట్టణంలోని ZPHS బాలుర పాఠశాలలో విద్యార్థులకు డ్రగ్స్, గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎస్సై రాజు మాట్లాడుతూ... యువత దేశ భవిష్యత్తుకు పునాది అని, అలాంటి యువత మత్తు పదార్థాల బారిన పడితే వారి వ్యక్తిగత జీవితం, కుటుంబం మరియు సమాజంపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు. డ్రగ్స్, గంజాయి, మద్యం వంటి మత్తు పదార్థాల వినియోగం వల్ల ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి, చదువుపై ఏకాగ్రత కోల్పోవడం, నేరాల వైపు ఆకర్షితులయ్యే ప్రమాదం ఉందన్నారు.
విద్యార్థులు తమ లక్ష్యాల సాధన కోసం విద్యపై పూర్తి దృష్టి సారించాలని, చెడు స్నేహాలు మరియు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. సోషల్ మీడియా ద్వారా లేదా స్నేహితుల ప్రలోభాలకు లోనై ఎటువంటి మత్తు పదార్థాలను వినియోగించరాదని హెచ్చరించారు.
డ్రగ్స్ మరియు గంజాయి విక్రయాలు, రవాణా, నిల్వ, వినియోగం చట్టరీత్యా నేరమని, ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థులు తమ పరిసరాల్లో ఎవరైనా డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు లేదా వినియోగిస్తున్నట్లు తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
అలాగే తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనలో మార్పులను గమనిస్తూ, వారి స్నేహితులు, రోజువారీ కార్యకలాపాలపై పర్యవేక్షణ ఉంచాలని సూచించారు. విద్యార్థుల్లో నైతిక విలువలు, క్రమశిక్షణ మరియు సామాజిక బాధ్యత పెంపొందేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి కృషి చేయాలని తెలిపారు.
డ్రగ్స్ మరియు మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం అందించేందుకు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (TGANB) టోల్ ఫ్రీ నంబర్ 1908 అందుబాటులో ఉందని, ఎవరైనా గోప్యంగా సమాచారం ఇవ్వవచ్చని తెలిపారు. సమాచారం అందించిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని చెప్పారు.
మత్తు పదార్థాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, యువత తమ జీవితాలను ఉన్నత లక్ష్యాల వైపు మలుచుకోవాలని ఎస్సై నరేష్ పిలుపునిచ్చారు.
అనంతరం డ్రగ్స్ అవేర్నెస్ పై ఏర్పాటుచేసిన వాల్పోస్టర్ను లెక్చరర్స్, విద్యార్థులతో ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
🏠 Home