🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 25 Jun, 2026 | Page: 1

ఈనెల 26న శ్రీ వేణుగోపాల స్వామి మండల పూజ కార్యక్రమం



నారాయణపేట, జూన్ 25( బివికే న్యూస్)

మఖ్తల్ పట్టణంలోని యాదవ నగర్ వీధిలో వెలసిన అత్యంత పురాతనమైన శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయ పున: ప్రతిష్ట జరిగి సంవత్సర కాలం అవుతున్న శుభ సందర్భాన ఈనెల 26 వ తేదీశుక్రవారం ద్వాదశి రోజు
స్థానిక శ్రీ వేణు గోపాల స్వామి దేవాలయంలో విశేష పూజ కార్యక్రమాలు జరగనున్నాయి.

కార్యక్రమ వివరాలు....

ఉదయం 8-00 గంటలకు పుణ్యాహవాచనము,గణపతి పూజ
9-00 లకు శ్రీకృష్ణ మంత్ర హోమం
10-00 లకు రుక్మిణి వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవం జరుగును.
ఈ కార్యక్రమంలో సకల భగవద్భద్భక్తులు అందరూ పాల్గొని స్వామి వారి కృప కు పాత్రులు కాగలరని ఆలయ కమిటీ భజన భక్త బృందం ఆహ్వానిస్తున్నారు.
🏠 Home