విద్యార్థుల భవిష్యత్తుతో రేవంత్ సర్కార్ చెలగాటం.. ఫీజు రీయింబర్స్‌మెంట్ రద్దుకు కుట్ర..
ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని రద్దు చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కుట్రలు పన్నుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. న్యాయస్థానం సాక్షిగా విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడుతుందని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యార్థుల సంక్షేమం కోసం ఉద్దేశించింది కాదని.. అది కేవలం ప్రభుత్వ ఆర్థిక వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ఒక రాజకీయ మాయాజామని విమర్శించారు. ప్రభుత్వం వందల కోట్ల ఫీజు రీఇంబర్స్‌మెంట్ బకాయిలను క్లియర్ చేయకుండా తన వద్దే పెట్టుకుందని అన్నారు.
మరోవైపు, ప్రైవేట్ కాలేజీలు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయకూడదంటూ చట్టపరమైన ఆంక్షలు విధించింది. అంటే… ఖజానా ఖాళీ చేసిన తన తప్పును కాలేజీల మీదకు నెట్టేస్తూ, తానేదో పేద విద్యార్థుల రక్షకుడిలా ప్రభుత్వం డ్రామాలు ఆడిందని దాసోజు శ్రవణ్ అన్నారు. హైకోర్టు ఈ జీవోపై స్టే ఇవ్వడం వెనుక ఉన్నది కేవలం ఒక తప్పుడు విధానాన్ని అడ్డుకోవడం మాత్రమే కాదని; ప్రభుత్వ చేతకానితనాన్ని నిలదీయడం కూడా అని తెలిపారు. కాలేజీలకు రావాల్సిన నిధులను నిలిపివేస్తూ… జీతాలు ఎలా కట్టాలి? కాలేజీలు ఎలా నడపాలి? అని కోర్టు ప్రశ్నించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు అని అన్నారు. కాలేజీలను ఆర్థికంగా దెబ్బతీస్తే విద్యా ప్రమాణాలు పడిపోతాయని.. క్యాంపస్ ప్లేస్‌మెంట్లు ఆగిపోతాయని తెలిపారు. చివరికి నష్టపోయేది పేద విద్యార్థులే అని స్పష్టం చేశారు.
సంక్షేమ పథకాన్ని అడ్డదారిలో ఖతం చేసే కుట్ర
ఇది కేవలం పరిపాలనాపరమైన వైఫల్యం కాదని.. ఫీజు రీఇంబర్స్‌మెంట్ పథకాన్ని లోపల నుంచే బలహీనపరిచి, పూర్తిగా రద్దు చేయడానికి ప్రభుత్వం పన్నిన ఒక క్రమబద్ధమైన కుట్రలా కనిపిస్తోందని దాసోజు శ్రవణ్ విమర్శించారు.