రాష్ట్రం విడిపోయినా మారని బుద్ధి.. తెలంగాణ సినిమాపై ఆకతాయిల వెటకారం..
తెలంగాణ అస్తిత్వం, సంస్కృతి మరియు వాడుక భాషా నేపథ్యాలతో వచ్చే సినిమాలపై సోషల్ మీడియా వేదికగా తరచూ వివాదాలు రాజుకుంటూనే ఉన్న సంగతి తెలిసిందే. గతంలో భారీ విజయాన్ని అందుకున్న ‘బలగం’ వంటి చిత్రాల విషయంలో జరిగినట్లే, తాజాగా ప్రియదర్శి మరియు నాగదుర్గ ప్రధాన పాత్రల్లో రాబోతున్న ‘ఇడుపు కాయితం’ అనే సినిమాపై కూడా నెట్టింట పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. తెలంగాణ వాడుక భాషలో ‘ఇడుపు కాయితం’ అంటే విడాకులు అని అర్థం వస్తుంది. అయితే ఈ చిత్ర టైటిల్ ప్రకటించినప్పటి నుండి సోషల్ మీడియాలో కొందరు ఆంధ్రా ప్రాంతానికి చెందిన నెటిజన్లు దీనిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు ఇది తెలుగు భాషేనా అని కొందరు ప్రశ్నించగా, మరికొందరు వ్యంగ్యంగా ఈ సినిమాకు తెలుగు డబ్బింగ్ ఉంటే చెప్పండి చూస్తామంటూ కామెంట్లు పెడుతున్నారు.
అయితే రాష్ట్రం విడిపోయి ఇన్నేళ్లయినా తెలంగాణ సంస్కృతిని, భాషను ఇంకా కొందరు తక్కువ చేసి చూస్తున్నారనడానికి ఈ తరహా కామెంట్లే నిదర్శనమని తెలంగాణ నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ విమర్శలపై తెలంగాణ వాసులు సోషల్ మీడియా వేదికగా గట్టిగానే స్పందిస్తూ ఆకతాయిల పోస్టులకు ధీటుగా కౌంటర్లు ఇస్తున్నారు. మీలాంటి వారి సంకుచిత ఆలోచనా విధానం చూశాకే మీ నుంచి విడిపోయి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటం ఎంత మంచిదైందో అర్థమవుతోందని, లేదంటే ఇప్పటికీ మా తెలంగాణ అస్తిత్వాన్ని, భాషను తొక్కిపెట్టేసేవారంటూ పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు తెలుగు సినిమాల్లో తెలంగాణ యాసను కేవలం హాస్య పాత్రలకో లేదా విలన్లకో పరిమితం చేసినా, మారుతున్న కాలంతో పాటు ‘ఫిదా’, ‘బలగం’, ‘దసరా’ వంటి సినిమాలు తెలంగాణ సంస్కృతిని వెండితెరపై సగర్వంగా చాటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరినీ ఆకట్టుకున్నాయని గుర్తు చేస్తున్నారు.