🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 26 Jun, 2026 | Page: 1

దేవరకొండ మండలంలో అంగన్‌వాడీ టీచర్ మరియు ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.

దేవరకొండ మండలంలోని పలు గ్రామాల్లో అంగన్‌వాడీ టీచర్ మరియు ఆయా పోస్టుల భర్తీకి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ విడుదలైనట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో నోటీసులను అతికించడం జరిగింది.
​ఈ నియామక ప్రక్రియలో భాగంగా మైనంపల్లి, గన్యనాయక తండా, కొర్రతండా, శేరిపల్లి, రత్య తండా, చెరువు కొమ్ము తండా, శకృ తండా మరియు దుబ్బ తండా గ్రామాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు.
​ఈ కార్యక్రమంలో భాగంగా సూపర్వైజర్లు డి. చిట్టమ్మ, ఎం. విజయలక్ష్మి గారితో పాటు, ఆయా గ్రామాల గౌరవ సర్పంచ్లు పాల్గొన్నారు. అర్హత కలిగిన స్థానిక అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, నోటిఫికేషన్ వివరాల కోసం సంబంధిత గ్రామ పంచాయతీ కార్యాలయాలను లేదా అంగన్‌వాడీ కార్యాలయాన్ని సంప్రదించాలని అధికారులు సూచించారు.
🏠 Home