🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 27 Jun, 2026 | Page: 1

నల్గొండ జిల్లా కనగల్ మండలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పర్యటన మరియు బహిరంగ సభను విజయవంతం చేయాలని మేడ సైదులు పిలుపు.

దేవరకొండ 27జూన్ (BVK 3 న్యూస్ ):
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక'లో భాగంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్ గారి ముఖ్య అనుచరులు, యువజన కాంగ్రెస్ నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మేడ సైదులు పేర్కొన్నారు.
​రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'తెలంగాణ రైసింగ్ 2047' నినాదంతో సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని ఆయన తెలిపారు. ముఖ్యంగా ఫ్యూచర్ సిటీ, మెట్రో రైలు విస్తరణ, రైతు రుణమాఫీ, సన్నబియ్యం, వడ్లకు బోనస్, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, మహాలక్ష్మి పథకం, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు వంటి అనేక పథకాలు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని ఆయన కొనియాడారు.
సభను విజయవంతం చేయండి:
నల్గొండ జిల్లా కనగల్ మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారు విచ్చేస్తున్నారని, ఈ బహిరంగ సభను అత్యంత విజయవంతం చేయాలని మేడ సైదులు పిలుపునిచ్చారు.
​ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎన్.ఎస్.యు.ఐ నాయకులు, యువజన కాంగ్రెస్ కార్యకర్తలు మరియు అనుబంధ సంఘాల సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని సభను జయప్రదం చేయాలని ఆయన కోరారు.
🏠 Home