నల్లగొండ జిల్లాలో ప్రజా సంఘాల నాయకుల ముందస్తు అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్న ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కమిటీ.
దేవరకొండ 28జూన్ (BVK 3 న్యూస్ ) : నల్లగొండ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పర్యటన నేపథ్యంలో, ప్రజాస్వామ్యబద్ధంగా తమ నిరసనను తెలియజేయడానికి సిద్ధమవుతున్న విద్యార్థి మరియు ప్రజా సంఘాల నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడాన్ని ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కమిటీ తీవ్రంగా ఖండిస్తోంది.
ఈ సందర్భంగా బుడిగా వెంకటేష్, ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కార్యదర్శి మాట్లాడుతూ:
ప్రజాస్వామ్య దేశంలో తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, నిరసన తెలపడం ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు అని అన్నారు.
ముఖ్యమంత్రి పర్యటన సాకుతో తెల్లవారుజామునే నాయకుల ఇళ్లకు వెళ్లి, వారిని బలవంతంగా అదుపులోకి తీసుకుని దేవరకొండ పోలీస్ స్టేషన్‌కు తరలించడం ప్రజాస్వామ్య విరుద్ధమని పేర్కొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న నాయకుల గొంతు నొక్కడం సరికాదని, ఈ అక్రమ అరెస్టులను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ఇటువంటి నిర్బంధ విధానాలను వీడి, ప్రజాస్వామ్య విలువలను గౌరవించాలని ఈ ప్రకటన ద్వారా కోరుతున్నాము.