🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 28 Jun, 2026 | Page: 1

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తుల గడువు పెంపు

దేవరకొండ 28జూన్ (BVK 3 న్యూస్ ) : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం డిగ్రీ (బి. ఎ, బీకాం, బీఎస్సీ) కోర్సుల్లో చేరడానికి చివరి తేదీ ఆగస్టు 7, 2026 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అని మునగాల కొండలరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ,దేవరకొండ ప్రిన్సిపల్ డాక్టర్ రమావత్ రవి సహాయ కేంద్రం-121 కోఆర్డినేటర్ డాక్టర్ వి.మకట్లాల్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆయా కోర్సుల్లో చేరడానికి విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలను websute: www.braouonlone.in లో పొందుపరిచినట్లు వెల్లడించారు. అలాగే ద్వితీయ మరియు తృతీయ సంవత్సర విద్యార్థులు కోర్సు ఫీజు కూడా ఆగస్టు 7, 2026 వరకు ఆన్లైన్ లో చెల్లించుకోవచ్చు అని తెలిపారు .మరిన్ని వివరాలకు 7382929721 ఫోన్ నెంబర్ను సంప్రదించాలని సూచించారు.
🏠 Home