ఆరోగ్యం.. ఇప్పుడు ‘ట్రాకర్ల’మయం
డాక్టర్లు, రిపోర్టులు కాదు... చిన్న చిన్న గ్యాడ్జెట్లు దేహదృఢత్వాన్నీ, ఆరోగ్యస్థితినీ అంచనా వేస్తున్నాయి. వాచీలూ, ఉంగరాలూ, ప్యాచ్‌లూ, బడ్స్ రూపంలో ఈ ‘వేరబుల్ స్మార్ట్ ట్రాకర్లు’ (శరీరానికి పెట్టుకునే పరికరాలు) ఒదిగిపోతున్నాయి. రోజువారీ నడిచే అడుగులు, గుండె కొట్టుకునే పద్ధతి, నిద్ర నాణ్యత, రికవరీ స్కోరు లాంటి డేటాను ఇవి రియల్ టైమ్‌లో చూపిస్తున్నాయి. ఉరుకులు పరుగుల ఆధునిక జీవితంలో ఆరోగ్యాన్ని ఓ కంట కనిపెడుతూ, హెచ్చరికలు చేస్తున్నాయి. ఆబాలగోపాలం స్మార్ట్ ట్రాకర్ల చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో వాటిపై ఓ ఫోకస్...
అరవై ఏళ్ల వయసున్న రాజేంద్రకు ఆయన కొడుకు ఒక ప్రముఖ బ్రాండ్ స్మార్ట్ వాచ్‌ను కానుకగా ఇచ్చాడు. ఒకరోజు రాత్రి రాజేంద్ర నిద్రపోతున్నపుడు ఆయన గుండె వేగం అసాధారణంగా పడిపోయింది. స్మార్ట్ ట్రాకింగ్ ఫీచర్ ఉన్న వాచ్ వెంటనే అలారం మోగించి హెచ్చరించింది. కంగారుపడినప్పటికీ అప్రమత్తమైన కుటుంబసభ్యులు వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. సైలెంట్ హార్ట్ ఎటాక్ వచ్చే లక్షణాలను పరికరం ముందుగానే గుర్తించి హెచ్చరించడంతో పెద్ద ముప్పు తప్పిందని వైద్యులు చెప్పారు.
బరువు తగ్గడం, ఫిట్‌నెస్, మంచి నిద్ర; అధిక రక్తపోటు, మధుమేహం పర్యవేక్షించడం... ఇలా ఏ సమస్యకైనా సరే, వ్యక్తిగత స్థాయిలో సంబంధిత సమాచారాన్ని అందించే వేరబుల్ పరికరాలు మార్కెట్లో అందరికీ అందుబాటులోకి వచ్చాయి.
book6.2.jpgఫిట్‌నెస్‌కు ప్రాధాన్యమిచ్చే ఓ ఆధునిక యువకుడి దినచర్య ఎలా ఉంటోందో చూడండి- ‘ఉదయం నిద్ర లేవగానే... ఎన్ని గంటలు నిద్రపోయానో తెలుసుకోవడానికి నా వేరబుల్ ట్రాకర్‌ను చూసుకుంటా. తర్వాత తీసుకునే క్యాలరీల పర్యవేక్షణకు అల్పాహారంగా ఏం తిన్నానో నమోదు చేస్తా. ట్రాకర్ నేను వేసే అడుగులను లెక్కిస్తుంది. ప్రతీరోజూ 10 వేల అడుగులు నడవాలనేది నా లక్ష్యం. సమాచారం అందుబాటులో ఉంది కాబట్టి... వ్యాయామం చేసేటప్పుడూ, విశ్రాంతి సమయంలోనూ నా గుండె కొట్టుకునే వేగాన్ని గమనిస్తా. అప్పుడప్పుడూ రక్తంలోని ఆక్సిజన్ స్థాయిని చూస్తా. ప్రతీరోజూ ఎంత నీరు తాగుతున్నాను? ఏ సమయంలోనైనా ఒత్తిడి స్థాయి ఎలా ఉంటోంది?...ఇలా అనేక అంశాలను గమనించే వీలు నాకుంది.’
అందరి చూపు... వీటి వైపే...
2026లో గ్లోబల్ వేరబుల్ మార్కెట్ 150 బిలియన్ డాలర్లు దాటిందని అంచనా. ప్రపంచవ్యాప్తంగా 30 శాతం మంది పెద్దలు ఒకటి కన్నా ఎక్కువ స్మార్ట్ ట్రాకర్లను ఉపయోగిస్తున్నారు. మనదేశంలోనూ వీటి వినియోగం ఊహించని వేగంతో దూసుకుపోతోంది. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) నివేదికల ప్రకారం- ప్రపంచంలోని అతి పెద్ద స్మార్ట్ వేరబుల్స్ మార్కెట్లలో భారతదేశం ఒకటి. ఏడాదికి దీని మార్కెట్ 20-30 శాతం వృద్ధిని నమోదు చేస్తోంది. గుండె జబ్బులు, మధుమేహులే కాకుండా కార్పొరేట్ సిబ్బందీ, ఆరోగ్యాభిలాషులూ ఈ డివైజ్‌లను విరివిగా వాడుతున్నారు. అవి అందించే డేటా ఆధారంగా అనుదిన వ్యాయామంలో మార్పులు చేసుకుంటున్నారు. ముఖ్యంగా యువత, ఉద్యోగులతో పాటు వయోధికులు సైతం వీటిని అమితంగా ఇష్టపడుతున్నారు. మన తెలుగు రాష్ర్టాల్లో చాలామంది చేతికి కొత్తగా స్మార్ట్ వాచీనో, ఫిట్‌నెస్ బ్యాండో దర్శనమిస్తోంది. ఈ తరహా గ్యాడ్జెట్లు ఇప్పుడు సామాజిక హోదాకు చిహ్నంగానూ మారాయి.
గత కొన్నేళ్లుగా ముఖ్యంగా కొవిడ్ తర్వాత ప్రజల్లో ఆరోగ్యస్పృహ బాగా పెరిగింది. దీంతో రక్త ఆక్సిజన్ (ఎస్‌పీ ఓటూ), హార్ట్ రేట్ మానిటరింగ్ ఫీచర్లున్న డివైజ్‌లకు విపరీతంగా గిరాకీ పెరిగింది. బడ్జెట్ ఫ్రెండ్లీగా.. రూ. 1500 నుంచి 5వేల రూపాయిల లోపు లభించే అద్భుతమైన ఫీచర్ల వల్ల ఇలాంటివి సామాన్యుడికి కూడా అందుబాటులోకి వచ్చేశాయి. ఎక్కువ స్ర్కీన్లతో ఉండే స్మార్ట్ వాచీలకు బదులు నాజూకైన లైట్ వెయిట్ స్మార్ట్ రింగులు కూడా వ్యాప్తిలోకి వస్తున్నాయి. టైటానియం, స్టెయిన్‌లెస్ స్టీల్ డిజైన్లతో రూపొంది అధిక ధరలకు లభ్యమవుతున్నాయి. ఇవి ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ (ఆర్‌ఈఎం), గాఢ నిద్ర, హృదయ స్పందనలు, ఉష్ణోగ్రత స్థితినీ నిరంతరాయంగా ట్రాక్ చేస్తున్నాయి.
అవసరానికి అనుగుణంగా...
హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనిల్ కొద్దికాలంగా ఓరా రింగ్‌ను ఉపయోగిస్తున్నాడు. ‘‘నేను రోజూ 8-9 గంటలు స్ర్కీన్ ముందు కూర్చుంటాను. ఓరా ఒక్కోసారి నాకు ‘రెడీనెస్ స్కోరు’ చూపించి, ‘ఈ రోజు హెవీ వర్కవుట్ అవసరం లేద’ని చెపుతుంది. ఆ రోజు లైట్ వాక్ మాత్రమే చేస్తాను’’ అని తన అనుభవం పంచుకున్నాడు.
నిద్ర, రికవరీ ట్రాకింగ్‌లో అత్యుత్తమంగా ఉన్న డివైజ్‌లు వర్కవుట్ ట్రాకింగ్‌లో బలహీనంగా ఉంటున్నాయి. కొన్నింటికి సబ్‌స్ర్కిప్షన్లు తప్పనిసరి. బిగినర్స్‌కు అనుకూలమైనవి కొన్ని, అథ్లెట్లకు అత్యుత్తమైనవి మరికొన్నీ. హై ఇంటెన్సిటీ వర్కవుట్స్‌లో కచ్చితత్వం తక్కువ ఉన్న కొన్ని డివైజ్‌లకైతే అడ్వాన్స్‌డ్ ఫీచర్లకు ప్రీమియం ప్లాన్ తీసుకోవాల్సిందే.
అందుకని ఎవరి అవసరానికి అనుగుణంగా వారు ట్రాకర్లను ఎంచుకోవాలి. ప్రాచుర్యం పొందుతున్నవాటిలో... అల్ర్టా హ్యూమన్ రింగ్ ఎయిర్, వీథింగ్స్ స్కాన్ వాచ్ 2 లాంటి డిస్‌క్రీట్ ట్రాకర్లు ఉన్నాయి. స్ర్కీన్ లేకపోవటం వల్ల చాలామందికి ఇవి ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ‘ఐ ఫోన్‌తో సీమ్‌లెస్ కనెక్టివిటీ, యాక్టివిటీ రింగ్స్ ద్వారా గేమిఫికేషన్, హార్ట్ రేట్ మానిటరింగ్ చాలా కచ్చితం. కానీ బ్యాటరీ 18-24 గంటలే వస్తుంది. నిద్ర ట్రాకింగ్ సాధారణం. నోటిఫికేషన్లు ఎక్కువ వస్తాయి’ అంటారు ఓ వినియోగదారుడు. ‘నీ హార్ట్ రేట్ వేరియబిలిటీ తగ్గింది. ఈ రోజు తేలిగ్గా వర్కవుట్ చేయ్’ అంటూ వచ్చే ఏఐ ఆధారిత ఇన్‌సైట్స్.. వేరబుల్ ట్రాకర్లు వినియోగించేవారికి సంతృప్తినీ, ఉత్సాహాన్నీ ఇస్తున్నాయి.