వైస్ కెప్టెన్ అయినా జట్టులో చోటు గ్యారంటీ కాదు.
భారత జట్టు ప్రస్తుతం ఐర్లాండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో ఆడిన తొలి మ్యాచ్‌లోనే పసికూన ఐర్లాండ్‌పై భారత్ 34 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో భారత టీ20 జట్టు వైస్ కెప్టెన్ తిలక్ వర్మకు మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ వార్నింగ్ ఇచ్చాడు. వైస్ కెప్టెన్ హోదాలో ఉన్నంత మాత్రాన జట్టులో స్థానం శాశ్వతం కాదని హెచ్చరించాడు. ప్రదర్శన చేయకపోతే ఎవరినైనా తప్పించే ధైర్యం టీమ్ మేనేజ్‌మెంట్‌కు ఉందని స్పష్టం చేశాడు.
‘తిలక్ వర్మ వైస్ కెప్టెన్ కావచ్చు. కానీ ఆ బాధ్యతల కారణంగా తుది జట్టులో స్థానం ఖాయం కాదు. గతంలో కూడా వైస్ కెప్టెన్లను జట్టు నుంచి తప్పించారు. ఆ బాధ్యతల వల్ల జట్టులో తన స్థానం సురక్షితమని తిలక్ భావిస్తే అది పెద్ద పొరపాటు అవుతుంది. ప్రతి మ్యాచ్‌లోనూ రాణించాల్సిందే. లేదంటే జట్టులో చోటు కోల్పోవాల్సి వస్తుంది. దీనికి అక్షర్ పటేల్ ప్రత్యక్ష ఉదాహరణ. అక్షర్ పటేల్ ఇటీవల ఫామ్‌ను ఆధారంగా చేసుకునే.. అతడి స్థానంలో తిలక్‌కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ప్రతి ప్లేయర్ తమ ప్రదర్శనతోనే జట్టులో చోటు సంపాదించుకోవాలి’ అని కైఫ్ స్పష్టం చేశాడు.