నేదునూరి మాట
కదిలే బంధాలు
కరిగే గుండెలు
శాస్త్ర సాంకేతికత పెరిగి
ఆధునిక విలాస జీవితాన్ని
అనుభవిస్తున్న మానవుడు
గోడల మధ్యన మనసులులేని
మనుషుల మధ్య ఒంటరిగా
జీవిస్తున్నాడు
ఒకే ఇంటిలో అందరు జీవిస్తున్న
ఎవరికి వారే యుమునా తీరే
అన్నట్లు ప్రత్యేక ఆలోచనా
ప్రపంచంలో మునిగి పోతున్నాడు
మనుషుల గుండెల మధ్యన
దూరాలు పెరుగుతున్నాయి
మాట మంచి ఓపికలు ఓదార్పు
నశించి పరనింద సంస్కృతి
రాజ్యమేలుతుంది
ఒంటరితనం తనం ఇంటింట
వటవృక్షంలా పెరుగుతోంది
కుటుంబ బంధాలు బీటలు వారి
బంధాలు అనుబంధాలు అడ్రస్
లేనివై అందరు ఉన్న అనాథల
సంఖ్య పెరుగుతోంది
వృద్ధాశ్రమాలే శరణ్యమై
సామాజిక పునాదుల్ని
కదిలించే కలియుగ
కలుషిత స్థితి ప్రభలడం
శోచనీయం
నేటి మానవుడు సామాజిక
మాధ్యమాల స్క్రీన్ల వెనుక
లైకులు వేటలో బతుకుతున్నాడు
పక్కన ఉన్న మనిషిని మరిచి
డిజిటల్ ప్రపంచంలో
మునుగుతున్నాడు
రక్తం పంచి పెంచిన చేతులు
నేడు పట్టుకునే దిక్కు లేక
వణుకుతున్నాయి
ప్రాణంగా చూసుకున్న పిల్లలు
బతుకు వేటలో పరదేశాల్లో
బ్రతుకుతూ ఉంటే
వృద్ధాప్యం దాపురించిన
తల్లిదండ్రులు అనాదలై
ఆదుకునే వారి కొరకు
ఎదురుచూస్తున్నారు
అడుగుల సప్పుడు వినపడక
తలుపుల వంక చూసి కళ్ళు
కాయలు కాచే పండుటాకులు
నిట్టూర్పుల మంటల్లో
నిలువునా కాలిపోతోంది
మానవత్వం.
వృద్ధులకు మందుల బిల్లల
తోడు మాత్రమే మిగిలింది
పలకరించే గొంతుక కోసం
ప్రాణం విలపిస్తోంది
వృద్ధుల కన్నీటి చుక్కల సాక్షిగా
ఈ సమాజం ఒక బతుకున్న
ఒక నిర్మానుష్య అరణ్యమైంది
ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై
స్వతంత్ర కుటుంబాల సంఖ్య
విజృంభించి స్వేచ్ఛ వాదం
వర్ధిల్లుతుంది ఆర్థిక ఆధిపత్యం
కొనసాగుతోంది
అందరు కలిసి నవ్వే రోజులు
పోయాయి కష్టాలు పంచుకునే
మనుసులు లేవు
మనిషికి మనిషి దూరమవుడమే
నేటి సమాజానికి పెద్ద శాపం
గుంపులో ఉన్న ఒంటరి బతుకులు
ఇదే నేటి ఆధునిక నరకమైంది
బంధాల వంతెనలు కడదాం
ప్రేమ అనురాగం ఆత్మీయత
అనుబంధాల పునాదులపై
ఆర్ధత అవగాహన పరోపకారం
జనహితమే పరమావధిగా
మెరుగైన సామాజిక సాంస్కృతిక
సంబంధాలతో నవ సమాజాన్ని
నిర్మిద్దాం మానవ మనుగడే
ద్యేయంగా వృద్ధులను ఆదరిద్దాం
ఒంటరితనానికి గుడ్బై చెప్పి
సమష్టి జీవన సౌరభంతో
సమాజంలో వెలుగులు నింపుదాం
(వృద్ధాప్యంలో ఒంటరి తనం గురించి స్పందిస్తూ రాసిన కవిత)
నేదునూరి కనకయ్య
అధ్యక్షులు
తెలంగాణ ఎకనామిక్ ఫోరం
కాలమిస్ట్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్
మాజీ ఎన్ ఎస్ ఎస్ అధికారి
కరీంనగర్9440245771
కరిగే గుండెలు
శాస్త్ర సాంకేతికత పెరిగి
ఆధునిక విలాస జీవితాన్ని
అనుభవిస్తున్న మానవుడు
గోడల మధ్యన మనసులులేని
మనుషుల మధ్య ఒంటరిగా
జీవిస్తున్నాడు
ఒకే ఇంటిలో అందరు జీవిస్తున్న
ఎవరికి వారే యుమునా తీరే
అన్నట్లు ప్రత్యేక ఆలోచనా
ప్రపంచంలో మునిగి పోతున్నాడు
మనుషుల గుండెల మధ్యన
దూరాలు పెరుగుతున్నాయి
మాట మంచి ఓపికలు ఓదార్పు
నశించి పరనింద సంస్కృతి
రాజ్యమేలుతుంది
ఒంటరితనం తనం ఇంటింట
వటవృక్షంలా పెరుగుతోంది
కుటుంబ బంధాలు బీటలు వారి
బంధాలు అనుబంధాలు అడ్రస్
లేనివై అందరు ఉన్న అనాథల
సంఖ్య పెరుగుతోంది
వృద్ధాశ్రమాలే శరణ్యమై
సామాజిక పునాదుల్ని
కదిలించే కలియుగ
కలుషిత స్థితి ప్రభలడం
శోచనీయం
నేటి మానవుడు సామాజిక
మాధ్యమాల స్క్రీన్ల వెనుక
లైకులు వేటలో బతుకుతున్నాడు
పక్కన ఉన్న మనిషిని మరిచి
డిజిటల్ ప్రపంచంలో
మునుగుతున్నాడు
రక్తం పంచి పెంచిన చేతులు
నేడు పట్టుకునే దిక్కు లేక
వణుకుతున్నాయి
ప్రాణంగా చూసుకున్న పిల్లలు
బతుకు వేటలో పరదేశాల్లో
బ్రతుకుతూ ఉంటే
వృద్ధాప్యం దాపురించిన
తల్లిదండ్రులు అనాదలై
ఆదుకునే వారి కొరకు
ఎదురుచూస్తున్నారు
అడుగుల సప్పుడు వినపడక
తలుపుల వంక చూసి కళ్ళు
కాయలు కాచే పండుటాకులు
నిట్టూర్పుల మంటల్లో
నిలువునా కాలిపోతోంది
మానవత్వం.
వృద్ధులకు మందుల బిల్లల
తోడు మాత్రమే మిగిలింది
పలకరించే గొంతుక కోసం
ప్రాణం విలపిస్తోంది
వృద్ధుల కన్నీటి చుక్కల సాక్షిగా
ఈ సమాజం ఒక బతుకున్న
ఒక నిర్మానుష్య అరణ్యమైంది
ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై
స్వతంత్ర కుటుంబాల సంఖ్య
విజృంభించి స్వేచ్ఛ వాదం
వర్ధిల్లుతుంది ఆర్థిక ఆధిపత్యం
కొనసాగుతోంది
అందరు కలిసి నవ్వే రోజులు
పోయాయి కష్టాలు పంచుకునే
మనుసులు లేవు
మనిషికి మనిషి దూరమవుడమే
నేటి సమాజానికి పెద్ద శాపం
గుంపులో ఉన్న ఒంటరి బతుకులు
ఇదే నేటి ఆధునిక నరకమైంది
బంధాల వంతెనలు కడదాం
ప్రేమ అనురాగం ఆత్మీయత
అనుబంధాల పునాదులపై
ఆర్ధత అవగాహన పరోపకారం
జనహితమే పరమావధిగా
మెరుగైన సామాజిక సాంస్కృతిక
సంబంధాలతో నవ సమాజాన్ని
నిర్మిద్దాం మానవ మనుగడే
ద్యేయంగా వృద్ధులను ఆదరిద్దాం
ఒంటరితనానికి గుడ్బై చెప్పి
సమష్టి జీవన సౌరభంతో
సమాజంలో వెలుగులు నింపుదాం
(వృద్ధాప్యంలో ఒంటరి తనం గురించి స్పందిస్తూ రాసిన కవిత)
నేదునూరి కనకయ్య
అధ్యక్షులు
తెలంగాణ ఎకనామిక్ ఫోరం
కాలమిస్ట్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్
మాజీ ఎన్ ఎస్ ఎస్ అధికారి
కరీంనగర్9440245771