🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 29 Jun, 2026 | Page: 1

జిల్లా ఎస్పీ నీ కలిసిన ఆఫీస్ సూపరింటెండెంట్‌ శ్యామ్ సుందర్ రాజు

నారాయణపేట, జూన్ 29 (బివికే న్యూస్)
నారాయణపేట జిల్లా పోలీస్ కార్యాలయం (డీపీఓ)లో నూతన ఆఫీస్ సూపరింటెండెంట్‌గా శ్యామ్ సుందర్ రాజు ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం నేడు జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేశారు.
శ్యామ్ సుందర్ రాజు తెలంగాణ స్పెషల్ పోలీస్ (TGSP) 10వ బెటాలియన్ నుంచి బదిలీపై నారాయణపేట జిల్లా డీపీఓ కార్యాలయానికి వచ్చారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్, ఐపీఎస్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి జిల్లా పోలీసు శాఖ పరిపాలనా వ్యవస్థను మరింత బలోపేతం చేసేలా కృషి చేయాలని సూచించారు.
కాగా, ఇంతకుముందు నారాయణపేట జిల్లా డీపీఓ కార్యాలయంలో ఆఫీస్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహించిన శంకర్ లాల్ బదిలీపై తెలంగాణ స్పెషల్ పోలీస్ (TGSP) 10వ బెటాలియన్‌కు వెళ్లారు.
🏠 Home