దేవరకొండ ఆర్టీసీ డిపోలో డ్రైవర్ కె.ఆర్. రెడ్డి పదవీ విరమణ
శాలువాలతో ఘనంగా సన్మానించి వీడ్కోలు
దేవరకొండ 30జూన్ (BVK 3 న్యూస్ ) : దేవరకొండ ఆర్టీసీ డిపోలో సుదీర్ఘకాలం పాటు డ్రైవర్‌గా విధులు నిర్వహించి, నేడు పదవీ విరమణ పొందుతున్న కె.ఆర్. రెడ్డికి డిపో సిబ్బంది మరియు కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన వీడ్కోలు సమావేశంలో డిపో మేనేజర్ విజయకుమార్ మాట్లాడుతూ, కె.ఆర్. రెడ్డి సంస్థకు అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
సమావేశంలో డిపో మేనేజర్ విజయ కుమారి మాట్లాడుతూ..."కె.ఆర్. రెడ్డి సంస్థ పట్ల ఎంతో నిబద్ధతతో పనిచేశారు. అధికారుల మన్ననలు పొందడమే కాకుండా, తోటి ఉద్యోగులతో ఎంతో స్నేహపూర్వకంగా మెలిగేవారు. ఆయన క్రమశిక్షణ, పని పట్ల అంకితభావం అందరికీ ఆదర్శప్రాయం," అని పేర్కొన్నారు.
తోటి ఉద్యోగుల ప్రశంసలు:
ఈ కార్యక్రమంలో పాల్గొన్న తోటి డ్రైవర్లు, కండక్టర్లు మాట్లాడుతూ, కె.ఆర్. రెడ్డి వృత్తి పట్ల చూపే నిబద్ధత తమకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ప్రయాణికులతో ఆయన వ్యవహరించే తీరు, మాట్లాడే పద్ధతి ఎంతో హుందాగా ఉండేవని, ఆయనతో కలిసి పనిచేయడం తమకు ఎంతో సంతోషాన్నిచ్చిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో కె.ఆర్. రెడ్డి సతీమణి అన్నపూర్ణ, కుమారుడు పవన్ కుమార్, కోడలు కృతి ,అల్లుడు ప్రణవ్, కుమార్తె నిహారిక, తమ్ముళ్లు గోవర్ధన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డిలతో పాటు డిపో మేనేజర్ విజయకుమార్, ఎం.ఎఫ్. కృష్ణయ్య, ఏడీసీ దీప్లాల్ మరియు ఆర్టీసీ సిబ్బంది, తోటి డ్రైవర్లు, కండక్టర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులు కె.ఆర్. రెడ్డిని శాలువాలతో ఘనంగా సన్మానించారు.