🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 30 Jun, 2026 | Page: 1

పూర్వీకుల స్మరణలో72 గంటల కఠోర మౌన దీక్షను విజయవంతంగా పూర్తి చేసిన ఎస్. రాము చౌహన్

దేవరకొండ 30జూన్ (BVK 3 న్యూస్ ) : తెల్దేరిపల్లి గ్రామానికి చెందిన, మలక్‌పేట ఎల్ఐసి సీనియర్ బ్రాంచ్ మేనేజర్ శ్రీ ఎస్. రాము చౌహన్ , తమ వంశపారంపర్య పూర్వీకులను స్మరించుకుంటూ, వారి ఆశీస్సులు పొందేందుకు అత్యంత కఠోరమైన మౌన దీక్షను చేపట్టారు.
​తన తాతగారైన శ్రీశ్రీశ్రీ సేవ్య సాద్ భగవాన్ వారి స్ఫూర్తితో, స్థానిక శ్రీ బాలాజీ మందిరంలో ఆయన వరుసగా 72 గంటల పాటు నిరంతర మౌన దీక్షను నిర్వహించారు. కఠిన నియమ నిబంధనలతో సాగిన ఈ ఆధ్యాత్మిక దీక్షను ఆయన నేడు విజయవంతంగా విరమించారు.
​ఈ సందర్భంగా శ్రీ రాము చౌహన్ మాట్లాడుతూ...
​"మన పూర్వీకులు మనకు అందించిన సంస్కృతి, సంప్రదాయాలను మరియు వారి ఆశీస్సులను స్మరించుకోవడం మన బాధ్యత. తాతగారి మార్గదర్శకత్వంలో, ఆధ్యాత్మిక చింతనతో కూడిన ఈ మౌన దీక్ష నాకు ఎంతో మానసిక ప్రశాంతతను మరియు నూతన ఉత్తేజాన్ని ఇచ్చింది. సమాజ శ్రేయస్సు కోసం, కుటుంబ సభ్యులందరిపై పూర్వీకుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ దీక్షను చేపట్టాను," అని పేర్కొన్నారు.
​ఈ కార్యక్రమానికి పలువురు గ్రామస్థులు, సన్నిహితులు మరియు శ్రేయోభిలాషులు హాజరై ఆయనకు అభినందనలు తెలిపారు. సభావట్ సేవ్య, సభావత్ రవి పూజారి పాండు నాయక్, మూడవ హథిరాం, చెన్నారం గ్రామం నుండి వందలాదిగా భక్తులు హాజరయ్యారు.
🏠 Home