జేఏసీ సంఘాల పిలుపు మేరకు నల్ల బడ్జిల నిరసన
కాసిపేట మండలం జులై 01 Bvk3 న్యూస్
మంచిర్యాల జిల్లా
జేఏసీ సంఘాల పిలుపు
మేరకు ఈ రోజు కాసిపేట 2వ గని లో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జ్ లు ధరించి నీరసన తెలిపిన కాసిపేట -2వ గని ఉద్యోగులు
నాలుగు లేబర్ కోడ్ ల ను తక్షణమే రద్దు చేయాలి
ఎన్ సి డబ్ల్యూ–XII వేతన ఒప్పంద ప్రక్రియను తక్షణమే వేగవంతంచెయ్యాలి.
11వ జాతీయ బొగ్గు వేతన ఒప్పందం ( ఎన్ సి డబ్ల్యూ 11 బోర్డు ) 2026 జూన్ 30తో ముగిసింది. 12వ జాతీయ బొగ్గు వేతన ఒప్పందం ఎన్ సి డబ్ల్యూ 12.బోర్డు 2026 జూలై 1 నుండి అమల్లోకి రావాల్సి ఉంది. అయితే, ఇప్పటి వరకు కోల్ ఇండియా యాజమాన్యం వేతన చర్చలను ప్రారంభించేందుకు అవసరమైన కమిటీని ఏర్పాటు చేయలేదు. గత వేతన ఒప్పందం సమయంలో మాత్రం జాతీయ కార్మిక సంఘాలతో సంప్రదింపులు జరిపి దాదాపు ఆరు నెలల ముందుగానే కమిటీని ఏర్పాటు చేశారు.
అదేవిధంగా, 2026 జూన్ 5న కోల్‌కతాలో జరిగిన అపెక్స్ జేసీసీ సమావేశంలో, కోల్ ఇండియా యాజమాన్యం లేబర్ కోడ్స్ అమలు విషయంలో జాతీయ కార్మిక సంఘాల అభిప్రాయాలను కోరింది. అయితే, జాతీయ కార్మిక సంఘాలు ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ముందుగా ఇచ్చి వేతన ఒప్పంద ప్రక్రియను ప్రారంభించడానికే ప్రాధాన్యత ఇవ్వాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశాయి.
ఈ నేపథ్యంలో, బొగ్గు పరిశ్రమలోని అన్ని కార్మిక సంఘాల సంయుక్త కార్యాచరణలో భాగంగా 2026 జూలై 1న "డిమాండ్స్ డే"గా పాటించి, ఎన్ సి డబ్ల్యూ –XII వేతన ఒప్పంద ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు నిర్వహించి ఎన్ సి డబ్ల్యూ –XII వేతన ఒప్పంద ప్రక్రియను తక్షణమే వేగవంతం చేయవలసిందిగా వినతి పత్రంన్ని సంబంధిత గని మేనేజర్
భారపాటి రమేష్ కి ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమం లో పిట్ సెక్రటరీ గొల్ల శ్రీనివాస్ పిట్ ఉపాధ్యక్షులు కే నర్సయ్య, అసిస్టెంట్ పిట్ బొద్దుల. వెంకటేష్,బొమ్మకంటి సాగర్, జావీద్,భార్గవ్,రాజాకొమురయ్య,రవి, రాయాలింగు,కమిటీ సభ్యులు. ముఖ్య నాయకులు, ఉద్యోగులు పాలుగోన్నారు.