సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్స్ డే వేడుకలు
- డాక్టర్ మణికంఠ గౌడ్ ను సన్మానించిన జిల్లా సైకిల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బి.గోపాలం
నారాయణపేట, (మక్తల్) జులై 1 (బీవీకే న్యూస్ )
జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని, నారాయణపేట జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ మణికంఠ గౌడ్ ను ప్రధాన కార్యదర్శి బి.గోపాలం, ఉపాధ్యక్షుడు జి. శివకుమార్ ఈనెల 1 న ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా బి.గోపాలం మాట్లాడుతూ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి ప్రముఖ వైద్యుడు డాక్టర్ భిధాన్ చంద్రరాయ్ జయంతి జులై 1న, భారతదేశమంతట ఘనంగా వైద్యుల దినోత్సవాన్ని జరుపుకుంటారని, మన భారత ప్రభుత్వం 1991 జులై 1 నుండి జాతీయ వైద్యుల దినోత్సవం జరుపుకోవడానికి నిర్ణయించిందని, ప్రజల ఆరోగ్యాలను కాపాడే వైద్యుడు దేవునితో సమానమని, కనిపించని ఆ దేవుడు ఊపిరి పోస్తాడని, కనిపించే ఈ దేవుడు మనకు పునర్జన్మను ప్రసాదిస్తాడని, మానవసేవకే అంకితమైన వైద్యులను మనం గౌరవించాలని, రోగులకు వైద్యుడు ఇచ్చే భరోసా రోగిలో బతకాలనే ఆశను రేకెత్తిస్తుందని, వైద్యులు మనకు ఆరోగ్య భాగ్యాన్ని అందించే పెన్నిధిలు, ఆత్మీయ నేస్తాలైన అపర దైవ స్వరూపాలు డాక్టర్స్. అంటే ధైర్యము, దైవము, ఆయువు, సైన్యము, సృష్టికి ప్రతి సృష్టి డాక్టర్స్ అని, రోగులకు ప్రాణం పోసే వైద్యులందరికీ బి. గోపాలం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైకిలింగ్ ప్రధాన కార్యదర్శి బి.గోపాలం, జి. శివకుమార్, చంద్రాములు, రోగులకు సేవ చేసే నర్సులు జి. కవిత, లలిత, సంధ్య, రాధిక, సమరీన్ పాల్గొన్నారు.