విద్యార్థులకు నాణ్యమైన విధితో పాటు మౌలిక సదుపాయాలన్నీ కల్పించాలి
- జిల్లా మైనార్టీ అధికారి ఎం ఏ రషీద్
నారాయణపేట, జూలై 1 (బి వి కే న్యూస్)
విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అన్ని మౌలిక వసతులు కల్పించాలని మైనారిటీ అధికారి ఎంఏ రషీద్ అధికారులను ఆదేశించారు.
బుధవారం పట్టణంలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలను మైనారిటీ అధికారి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న విద్యా సదుపాయాలు,తరగతి గదులు, వసతి గృహాలు,తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు,పరిశుభ్రత, భద్రతా ఏర్పాట్లు మరియు ఇతర మౌలిక వసతులను క్షుణ్ణంగా పరిశీలించారు.విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు అందుబాటులో ఉండేలా నిరంతరం చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అనంతరం పాఠశాల వంటశాలను సందర్శించి,ఆహార తయారీ విధానం,పరిశుభ్రత ప్రమాణాలు,నిల్వ చేసిన ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు.విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన,పోషకాహారం అందించాలని, వంటశాలలో పరిశుభ్రతను కచ్చితంగా పాటించాలని సూచించారు.
విద్యార్థుల ఆరోగ్యం,భద్రత,విద్యా ప్రమాణాల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని పాఠశాల సిబ్బందికి ఆదేశించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్కూల్ యూనిఫార్మ్స్ పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ మహబూబ్ ఖాన్,అధ్యాపకులు,వార్డెన్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు