🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 02 Jul, 2026 | Page: 1

చిరుమ‌ర్తిలో ఓటు నమోదుపై అవ‌గాహ‌న‌

18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ఓటు హక్కు పొందుటకు అర్హులని, అలా అర్హత ఉన్నవారు ఓటు నమోదు చేసుకోవాలని తెలంగాణ సాంస్కృతిక సారధి నల్లగొండ బృంద నాయకుడు ఇరిగి శ్రీనివాస్ అన్నారు. మాడ్లూల‌ప‌ల్లి మండలంలోని చిరుమర్తి గ్రామంలో ఓటు విలువను, ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన బాధ్య‌త‌ను ఆటా, పాట, మాటల ద్వారా తమ బృందంతో కలిసి కళా ప్రదర్శనలతో చైతన్య పరిచారు. స‌ర్ గురించి తెలుపుతూ ఇది బోగస్ ఓట్ల తొలగింపు కోసం వచ్చిందని, అర్హత కలిగిన వారి ఓటుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, బీఎల్ఓల‌ సహకారంతో సరైన సమాచారాన్ని ఫారంలో పొందుపరిస్తే చాలన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో సర్పంచ్ కూరెళ్ల నాగమణి, వెంకటాచారి, బీఎల్ఓలు, పాల్గొన్నారు.

🏠 Home