🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 03 Jul, 2026 | Page: 1

ధోని, జకోవిచ్‌లో ఓ అరుదైన గుణం ఉంది

భారత క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోని, టెన్నిస్ స్టార్ ప్లేయర్ జకోవిచ్‌ల గురించి టీమిండియా మహిళా పేసర్ దీప్తి శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వీరిద్దరిలో ఓ అరుదైన గుణం ఉందని తెలిపింది. ఎంతటి ఒత్తిడి పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఉండి మ్యాచ్‌ను తమవైపు తిప్పుకునే అరుదైన లక్షణం వీరిద్దరిలో ఉందని దీప్తి శర్మ వెల్లడించింది. వింబుల్డన్ టోర్నీకి వెళ్లిన దీప్తి.. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలపై మాట్లాడింది.
‘జకోవిచ్ ప్రస్తావన వస్తే అందరూ ముందుగా అతడి మానసిక దృఢత్వం గురించే చెబుతుంటారు. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా అతడు పోరాటం మాత్రం ఆపడు. క్రికెట్‌లో ఇలాంటి లక్షణాలు ఎంఎస్ ధోని సర్‌లో కనిపిస్తాయి. ఆయన కూడా ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు. ఒత్తిడి ఉన్నప్పటికీ ఎలాంటి ఆందోళన పడకుండా మ్యాచ్‌ను అద్భుతంగా ముగిస్తారు. ధోని సర్, జకోవిచ్ ఇద్దరిలోనూ ఓ అరుదైన గుణం ఉంది. అత్యంత కీలక సమయంలో ఒత్తిడిని అధిగమించి ప్రశాంతంగా ఉంటారు. వారిని చూసి చాలా విషయాలు నేర్చుకోవచ్చు’ అని దీప్తి శర్మ తెలిపింది.
🏠 Home