🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 03 Jul, 2026 | Page: 1

రాష్ట్ర డీజీపీ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్

సమర్థవంతమైన పోలీసింగ్, క్రమశిక్షణ, ప్రజలకు జవాబుదారీతనం పెంపుపై డీజీపీ దిశానిర్దేశం
నారాయణపేట, జులై 3 (బివికె న్యూస్)
తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖలో సమర్థవంతమైన పోలీసింగ్ ప్రమాణాల అమలు, ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడం, పోలీసు వ్యవస్థలో క్రమశిక్షణ, జవాబుదారీతనం పెంపు లక్ష్యంగా రాష్ట్ర డీజీపీ C. V. ఆనంద్ నిర్వహించిన రాష్ట్రస్థాయి వీడియో కాన్ఫరెన్స్‌లో నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS జిల్లా పోలీసు అధికారులతో కలిసి పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో డీజీపీ పోలీసు అధికారులు ప్రజలకు మరింత నాణ్యమైన, పారదర్శకమైన సేవలు అందించేందుకు కృషి చేయాలని సూచించారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ, నిజాయితీ, బాధ్యతాయుత వైఖరి పాటించాలని, పాత విధానాలను వదిలి ఆధునిక పోలీసింగ్‌కు అనుగుణంగా మారాలని ఆదేశించారు.
అలాగే రాష్ట్రంలో సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నియంత్రణ, రోడ్డు భద్రత, మహిళలు మరియు చిన్నారుల రక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, భరోసా కేంద్రాలు, షీ టీమ్స్‌ను మరింత బలోపేతం చేయాలని సూచించారు. నేరాల నియంత్రణలో సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తూ ప్రజలకు సత్వర సేవలు అందించాలని పేర్కొన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPSతో పాటు జిల్లాలోని అదనపు ఎస్పీ MD రియాజ్ హుల్ హక్, డీఎస్పీలు మహేష్ , నల్లపు లింగయ్య, సీఐలు, ఎస్‌ఐలు మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.
🏠 Home