🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 03 Jul, 2026 | Page: 1

ఘనంగా దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ జన్మదిన వేడుకలు: అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానన్న ఎమ్మెల్యే!

దేవరకొండ 03జూలై (BVK 3 న్యూస్ ) : దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ గారి జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ పున్న కైలాష్ నేత ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్యే బాలు నాయక్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ వేడుకల్లో దేవరకొండ నియోజకవర్గంలోని అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ గారితో పాటు వారి సతీమణి శ్రీమతి జ్యోతి ప్రసన్న గారికి, కుమారుడు దేవరన్ నాయక్ గార్లను పుష్పగుచ్చాలతో, శాలువాలతో ఘనంగా సత్కరించి, గజమాలలు వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ మాట్లాడుతూ, తన జన్మదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపేందుకు విచ్చేసిన "నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ పున్న కైలాష్ నేత గారికి, నియోజకవర్గ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు."

"ప్రజల ఆశీర్వాదం, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సహకారంతో దేవరకొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తానని అన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ప్రతి గ్రామ అభివృద్ధి, ప్రతి కుటుంబ సంక్షేమమే తన లక్ష్యమని పేర్కొన్నారు."

ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉన్న కైలాష్ నేత , దేవరకొండ నియోజకవర్గం అన్ని మండలాల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

జన్మదిన వేడుకలు ఆత్మీయ వాతావరణంలో, హర్షాతిరేకాల మధ్య అత్యంత ఘనంగా జరిగాయి
🏠 Home