🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 04 Jul, 2026 | Page: 1

జర్నలిస్టుల పిల్లలకు విద్యాశాఖ ఫీజు రాయితీ సర్కులర్ వెంటనే విడుదల చేయాలి: టీయూడబ్ల్యూజే డిమాండ్.

దేవరకొండ 04జూలై (BVK 3 న్యూస్ ) : జర్నలిస్టుల పిల్లలకు ప్రభుత్వం ప్రకటించిన విద్యా ఫీజు రాయితీని వెంటనే అమలు చేయాలని, అందుకు సంబంధించిన అధికారిక సర్కులర్‌ను విద్యాశాఖ తక్షణమే విడుదల చేయాలని టీయూడబ్ల్యూజే ఐజేయు దేవరకొండ డివిజన్ అధ్యక్షుడు గాదె గిరిధర్ రావు డిమాండ్ చేశారు.ఈ మేరకు జిల్లా టీయూడబ్ల్యూజే ప్రతినిధులు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా విద్యాశాఖ అధికారిని ( డిఈఓ ) కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జర్నలిస్టులు అనేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని, వారి పిల్లల చదువు కోసం ప్రభుత్వం ఇచ్చే రాయితీ ఎంతో అవసరమని పేర్కొన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమై 20 రోజులు గడుస్తున్నప్పటికీ, విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
​ప్రభుత్వం స్పందించి వెంటనే ఫీజు రాయితీ అమలయ్యేలా సర్కులర్ విడుదల చేయాలని వారు కోరారు. ఒకవేళ విద్యాశాఖ నిర్లక్ష్యాన్ని వీడకపోతే, టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు.
🏠 Home