🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 04 Jul, 2026 | Page: 1

ర్యాగింగ్ నివారణపై అవగాహన సదస్సు

- ప్రభుత్వ చట్టాలపై విద్యార్థులకు అవగాహన
చదువుతోనే సమాజంలో గుర్తింపు వస్తుంది
- సీనియర్ సివిల్ జడ్జి వింధ్య నాయక్
నారాయణపేట, జూలై 4 (బి వి కే న్యూస్ )
తెలంగాణా రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ మరియు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్ కం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు నారాయణపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో "ర్యాగింగ్ నివారణ" అవగాహన కార్యక్రమం సీనియర్ సివిల్ జడ్జి వింధ్య నాయక్ అధ్యక్షతన శనివారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించడం జరిగింది. సీనియర్ సివిల్ జడ్జి వింధ్య నాయక్ మాట్లాడుతూ ర్యాగింగ్ అనేది సరదా కాదు. ర్యాగింగ్ వల్ల ఒక విద్యార్థి మానసికంగా కుంగిపోతాడు. చదువు ఆగిపోతుంది. కాబట్టి ఎవరూ ర్యాగింగ్ చేయొద్దు, చేయించుకోవద్దు. ఒకవేళ మీకు ఎవరైనా ఇబ్బంది పెడితే భయపడకుండా వెంటనే కళాశాల యాజమాన్యానికి, తల్లిదండ్రులకు లేదా 100 నెంబర్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయండి. మీరు బాగా చదివి తల్లిదండ్రులకు, కళాశాలకు, మంచి పేరు తీసుకురావాలి. ఈ వయసు చాలా సున్నితమైనది. ఈ వయసులో చేసే చిన్న తప్పు కూడా మీ జీవితాన్ని మొత్తం మార్చేస్తుంది. అందుకే చెడు అలవాట్లకు, చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి అని తెలిపారు. ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి సాయి మనోజ్ మాట్లాడుతూ చట్టాలను గౌరవించాలని, విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, పోక్సో చట్టం, రాజ్యాంగంలోని హక్కుల పట్ల అవగాహన కలిపించారు. అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అవినాష్ మాట్లాడుతూ సోషల్ మీడియా వ్యసనం వద్దని, సమయాన్ని చదువుకు కేటాయించాలని తెలిపారు. చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్సె కౌన్సెల్ కే. లక్ష్మిపతి గౌడ్ న్యాయ సహాయం కోసం టోల్ ఫ్రీ నెం. 15100 గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ సుదర్శన్ రావు, రఘువీర్, దత్తాత్రేయ, క్రాంతి న్యాయవాదులు, పోలీస్ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
🏠 Home