🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 04 Jul, 2026 | Page: 1

కొండమల్లేపల్లి 'అర్థగిరి క్షేత్రం' (మల్లెల గట్టు) అభివృద్ధికి బాటలు: 111 మంది సభ్యులతో ట్రస్ట్ ఏర్పాటుకు సన్నాహాలు


దేవరకొండ 04జూలై (BVK 3 న్యూస్ ) : కొండమల్లేపల్లి పట్టణంలో కీర్తిశేషులు స్వర్గీయ కుంభం పుల్లారెడ్డి సుజాతమ్మలు నిర్మించిన ప్రముఖ శ్రీ పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయం (అర్థగిరి క్షేత్రం, మల్లెల గట్టు ) మరింత అభివృద్ధి చెందాలంటే ట్రస్టు ఏర్పాటు చేయాలని ఆలయ శాశ్వత ధర్మకర్త కుంభం మనోహర్ రెడ్డి అన్నారు. శనివారం ఆలయం వద్ద ఏర్పాటుచేసిన సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 111 మంది సభ్యులతో ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ట్రస్టులో సభ్యత్వం పొందేవారు 33,111 రూపాయలు చెల్లించి సభ్యత్వం పొందాలన్నారు. ఈనెల జూలై 15 తారీకు లోపు డబ్బులు చెల్లించిన వారికి మాత్రమే మొదటగా కమిటీలో అవకాశం ఉంటుందన్నారు. జులై 18 శనివారం 10 గంటలకు ఆలయం వద్ద సర్వసభ్య సమావేశం ఉంటుందని తెలియజేశారు. ఆరోజు ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, అందరి సమక్షంలో కమిటీ సభ్యులను ఎన్నుకుంటామన్నారు. ఆలయం వద్ద జరిగే కార్యక్రమాలు ఆలయ అభివృద్ధికి సమయం ఇచ్చే వారికే కమిటీలో స్థానం కల్పిస్తామన్నారు. మరింత మంది దాతలు ముందుకు వచ్చి ఆలయ అభివృద్ధికి తోడ్పడేలా కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా శనివారం హాజరైన సభ్యుల సమక్షంలో కొన్ని సూచనలు, సలహాలు, అభిప్రాయాలు సేకరించారు.తదుపరి కార్యాచరణ పై సమాలోచన చేశారు. భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ శాశ్వత ధర్మకర్త కుంభం మనోహర్ రెడ్డి సునీత, స్థానిక సర్పంచ్ పసునూరు యుగేందర్ రెడ్డి, ఊటుకూరి శ్రీనివాస్ రెడ్డి, బండారు రాము (సుధాకర్), చిత్తరంజన్ రెడ్డి, నారాయణరెడ్డి, ప్రతాప్ రెడ్డి, పాంపాటి శ్రీధర్, సముద్రాల వెంకన్న, చెట్లపల్లి శ్రీనివాస్, కాసర్ల వెంకటేశ్వర్లు, రవీందర్, దాచేపల్లి నరేందర్, ఏరుకొండ రాము, తడకమల్ల శ్రీనివాస్,యాదా ధనుంజయ, దొడ్డి సుధాకర్,కట్ట వెంకటరెడ్డి, అంకి శెట్టి శేఖర్,కాంసెట్టి నరేందర్, లోకేష్, ఇస్లావత్ సురేష్, సదానంద, శివకుమార్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
🏠 Home