దేవరకొండలో 'వాయిస్-4' శిక్షణ కార్యక్రమం
మహిళా సాధికారతకు నాయకత్వ నైపుణ్యాలే పునాది
దేవరకొండ 04జూలై (BVK 3 న్యూస్ ) : దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో శనివారం నాడు మహిళల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించి, సమాజంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేలా చేయడమే లక్ష్యంగా 'వాయిస్-4' శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా సాధికారత స్వేచ్ఛ నాయకత్వ లక్షణాలు కమ్యూనికేషన్ నైపుణ్యాలు వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
శిక్షణలో పాల్గొన్న మహిళలకు సమాజంలో నాయకత్వ పాత్రను ఎలా పోషించాలి, సమస్యలను ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలి, సమర్థవంతమైన సంభాషణ ద్వారా ప్రజల్లో అవగాహన ఎలా పెంచాలి అనే అంశాలపై నిపుణులు వివరించారు. మహిళలు తమ హక్కులను తెలుసుకుని ఆర్థిక, సామాజిక, వ్యక్తిగత రంగాల్లో మరింత ముందుకు సాగాలని సూచించారు.
కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు తమ అభిప్రాయాలను పంచుకుంటూ, ఇలాంటి శిక్షణలు గ్రామీణ మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతో పాటు నాయకత్వ లక్షణాలను మరింత మెరుగుపరుస్తాయని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో హెచ్.ఎం కవిత, హెచ్ డబ్ల్యు ఓ శేఖర్ రెడ్డి ఉపాధ్యాయులు వాయిస్ టీమ్ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.