🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 05 Jul, 2026 | Page: 1

తెలంగాణ చేనేత ఐక్యవేదిక ఆధ్వర్యంలో సిరిపోతు శ్రీరాములు ఘన సన్మానం

దేవరకొండ 05జూలై (BVK 3 న్యూస్ ) : తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ సర్వసభ్య సమావేశం హైదరాబాద్‌లోని ఆందోళన మైసమ్మ అమ్మవారి సన్నిధిలో ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశానికి దేవరకొండ పట్టణ శ్రీ భక్త మార్కండేయ స్వామి దేవాలయ మాజీ అధ్యక్షులు సిరిపోతు శ్రీరాములు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
​ఈ సందర్భంగా తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు వీర మోహన్ మాట్లాడుతూ, గత సంవత్సర కాలంగా సిరిపోతు శ్రీరాములు తమకు అప్పగించిన బాధ్యతలను అత్యంత నిబద్ధతతో, సంపూర్ణంగా పూర్తి చేశారని కొనియాడారు. చేనేత రంగం అభివృద్ధి కోసం, ఐక్యవేదిక బలోపేతం కోసం ఆయన చేసిన కృషిని గుర్తించి, రాపోలు వీర మోహన్ ఆయనను శాలువాతో సన్మానించి, జ్ఞాపికను బహుకరించారు.
​ఈ సందర్భంగా సిరిపోతు శ్రీరాములు మాట్లాడుతూ, తనకు లభించిన ఈ గౌరవం బాధ్యతను మరింత పెంచిందని అన్నారు. భవిష్యత్తులో కూడా చేనేత ఐక్యవేదిక లక్ష్యాల సాధనలో, తమ బాధ్యతలకు సంపూర్ణ న్యాయం చేకూర్చే విధంగా నిరంతరం కృషి చేస్తానని ఆయన ఉద్ఘాటించారు.
🏠 Home